epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆస్తిపన్ను వసూళ్లలో అలసత్వం ఉండొద్దు

ఆస్తిపన్ను వసూళ్లలో అలసత్వం ఉండొద్దు
విలీన గ్రామాల్లో ఆస్తిప‌న్నుల‌ను స‌వ‌రించాలి
క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్ల‌ ప్రాపర్టీలను ట్యాక్స్ కిందకు తీసుకురండి
క‌రీంన‌గ‌ర్ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్నుల వసూళ్లను వంద‌ శాతం పూర్తి చేయాలని కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ అధికారులు ఆదేశించారు. శుక్రవారం ఎన్‌ఏసీ సమావేశ మందిరంలో రెవెన్యూ విభాగం ఆర్వీ ఏళ్ళు, ఆర్‌ఐలు, వార్డు అధికారులు, ఇంజనీరింగ్ విభాగం డీఈలు, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆస్తిపన్ను వసూళ్లలో ఏ విధమైన అలసత్వం సహించబోమని స్పష్టం చేశారు. ప్రతి వార్డు ఆఫీసర్‌కు ఇవ్వబడిన లక్ష్యాల ప్రకారం వసూళ్లు జరగాలని తెలిపారు. మొండి బకాయిదారులు పన్నులు చెల్లించేందుకు చర్యలు తీసుకుని, వారం రోజుల్లో చెల్లించని వారికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. పన్నులు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు ఉంటే వారి నల్లా కనెక్షన్లను తొలగించే వరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి బకాయిలు మిగలకుండా చూడాలని అన్నారు.

విలీన గ్రామాల్లో ఆస్తిప‌న్నుల‌ను స‌వ‌రించాలి

కొత్తగా విలీనం అయిన గ్రామాలతో పాటు 2019లో విలీనం చేసిన గ్రామాల డివిజన్లలో అండర్ అసెస్మెంట్లను ప్రాధాన్యతగా పూర్తి చేసి, ఆస్తిపన్నుల్లో ఉన్న తేడాలను సవరించాలని సూచించారు. ఫంక్షన్ హాల్స్, పెట్రోల్ బంకులు, కమర్షియల్ ప్రాపర్టీలతో సంబంధించి ఉన్న అండర్ అసెస్మెంట్లను పూర్తిచేసి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని తెలిపారు. ముఖ్యంగా కమర్షియల్ ప్రాపర్టీల్లో భారీ బకాయిలు ఉన్నవారి పన్నులను తప్పనిసరిగా వసూలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం కార్యాలయాలకు సంబంధించిన ఆస్తిపన్నులు కూడా వసూలు చేయాలని స్పష్టం చేశారు. 2021 నుంచి ఆర్వీఏల్‌,ఆర్‌ఐ లాగిన్‌ల్లో పెండింగ్‌లో ఉన్న సెల్ఫ్ అసెస్మెంట్లను రీ-వెరిఫికేషన్ చేసి వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. నిర్మాణం లేకుండా ఉన్న చోట్ల హౌస్ నెంబర్లు కేటాయించినట్లయితే వాటిని గుర్తించి వెంటనే రద్దు చేయాలని అన్నారు.

ఆ ప్రాపర్టీలను కమర్షియల్ ట్యాక్స్ కిందకు తీసుకురండి

ఎన్‌పీడీసీఎల్ కమర్షియల్ మీటర్లు ఉన్న ప్రాపర్టీల పన్నులను కమర్షియల్ ట్యాక్స్ కిందకు మార్చాలని కమిష‌న‌ర్ ఆదేశించారు. యూసేజ్ మార్చిన ప్రాపర్టీల అండర్ అసెస్మెంట్లను కూడా పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు పొందిన లబ్ధిదారులకు సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ను వేగవంతం చేసి నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి కమిషనర్ సూచించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు ఖాధర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, అసిస్టెంట్ కమిషనర్ దిలీప్‌కుమార్, ఎంహెచ్‌ఓ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.