epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లొంగిపోవాల్సిందే ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశం

లొంగిపోవాల్సిందే ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశం

మాజీ ఐపీఎస్ అధికారికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

సిట్ కస్టోడియల్ దర్యాప్తున‌కు ధర్మాసనం అనుమతి

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క ప‌రిణామం

తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావుకు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీస్​ స్టేషన్​లో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్‌రావును కస్టోడియల్ దర్యాప్తు చేయడానికి ధర్మాసనం ప్రత్యేక దర్యాప్తు బృందాని (సిట్)కు అనుమతి ఇచ్చింది. ఆయనకు భౌతికంగా ఎలాంటి హాని లేకుండా చూడాలని తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేస్తూ చట్టప్రకారం ప్రభాకర్‌రావు దర్యాప్తు ప్రక్రియ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.

సమాచారాన్ని ముందే డిలీట్ చేశారు

పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పిస్తూ విచారణకు సహకరించాలని న్యాయస్థానం చెప్పినా ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఐక్లౌడ్‌ పాస్‌వర్డ్‌లను రీసెట్‌ చేసి అందులోని వివరాలను దర్యాప్తు అధికారులకు చూపించాలని కోర్టు ఆయనకు చెప్పినప్పటికీ కేవలం రెండు పాస్‌వర్డ్‌లను మాత్రమే రీసెట్‌ చేశారని తెలిపారు. అందులో రీసెట్‌ చేసిన రెండు అకౌంట్లలోని సమాచారాన్ని ముందే డిలీట్‌ చేశారని చెప్పారు. కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ బీవీ నాగరత్న స్పందిస్తూ కోర్టు పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పించడం వల్ల దర్యాప్తునకు ఏమాత్రం సహకరించట్లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని దీనిపై మీరేమంటారని ప్రభాకర్‌రావు తరఫున న్యాయవాది రంజిత్‌ కుమార్‌ను ప్రశ్నించారు. పిటిషనర్‌ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్న పలు విషయాలను వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు ఆయన చెప్పారు.

తదుపరి విచారణ వాయిదా

కేసు దర్యాప్తునకు సహకరిస్తున్న వివరాలతో కూడిన అఫిడవిట్‌ను మంగళవారం సాయంత్రం 4 గంటలకు దాఖలు చేయడంతో దానిని పరిశీలించలేదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చెప్పారు. అభిప్రాయం చెప్పడానికి సమయం ఇవ్వాలని కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేశారు. ఇరువైపులా వాదనలు పరిశీలించిన ధర్మాసనం చివరగా సిట్‌ అధికారి ఎదుట ప్రభాకర్‌రావు లొంగిపోవాలని ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల పాటు జరిగే ఈ కస్టోడియల్ విచారణలో ఇంటి నుంచి భోజనం, ఆరోగ్యానికి సంబంధించిన మందులు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రాహుల్‌ కాన్వాయ్‌లో ఢీ!

రాహుల్‌ కాన్వాయ్‌లో ఢీ! ఐదు కార్లు, అంబులెన్స్‌ పరస్పరం ఢీకొన్న వైనం పార్టీ కార్యకర్తలు,...

టీవీ ఛానళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు!

టీవీ ఛానళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు! వార్తల ప్రసారంలో నియమావళి ఉల్లంఘనలకు చెక్‌ ఉగ్రవాద...

ఒకే రావణుడు.. మూడు రూపాలు! ఒకచోట రాజు, ఒకచోట దేవుడు, మరోచోట రాక్షసుడు!

ఒకే రావణుడు.. మూడు రూపాలు! ఒకచోట రాజు, ఒకచోట దేవుడు, మరోచోట...

మెటా అల్గారిథమ్‌లపై కేంద్రం కొరడా!

మెటా అల్గారిథమ్‌లపై కేంద్రం కొరడా! ఒకే తరహా కథనాలకే ప్రాధాన్యం ఇవ్వొద్దు పాత వీడియోలు,...

టీవీకేకు మంత్రుల నుంచే 99 శాతం విరాళాలు!

టీవీకేకు మంత్రుల నుంచే 99 శాతం విరాళాలు! విజయ్‌ పార్టీకి నలుగురు దాతల...

మిత్రుల జైలు జీవితం.. అభిజీత్‌ దిప్కే భావోద్వేగం!

మిత్రుల జైలు జీవితం.. అభిజీత్‌ దిప్కే భావోద్వేగం! సౌకర్యవంతమైన జీవితాలను వదిలి ప్రజల...

బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు భర్త హత్య కేసులో భార్య,...

జంతర్‌ మంతర్‌ 2.0కు కొత్త నాయకత్వం

జంతర్‌ మంతర్‌ 2.0కు కొత్త నాయకత్వం దీప్కే నిర్బంధంలో.. అజింక్య శిందేకు బాధ్యతలు సీఈసీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.