epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జనగణన తొలి విడత‌కు రంగం సిద్ధం

జనగణన తొలి విడత‌కు రంగం సిద్ధం

2026 ఏప్రిల్ నుంచి దేశంలోని ఇళ్ల వివరాల సేకరణ

ముగిసిన ప్రీ- టెస్ట్ ప్రక్రియ

స్వాతంత్య్రం వచ్చాక జరుగుతున్న 8వ సారి..

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: దేశంలోనే తొలిసారిగా డిజిటల్‌గా జరగనున్న జనగణన- 2027కు రంగం సిద్ధమైంది. జనాభా లెక్కింపునకు సంబంధించిన ప్రీ- టెస్ట్ ప్రక్రియ ముగిసింది. జనగణన తొలి విడతలో భాగంగా 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు దేశంలోని ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. యావత్ దేశంలోని ఇళ్ల వివరాలను ఎలా సేకరించాలి ? ఇందుకోసం ఏ విధమైన మార్గదర్శకాలను అనుసరించాలి? మానవ వనరులను ఎలా మోహరించాలి? అనే దానిపై ప్రీ- టెస్ట్‌లో ముమ్మర కసరత్తు చేశారు. పారదర్శకంగా ఇళ్ల వివరాల సేకరణకు అనుసరించాల్సిన మార్గాలపై అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, ఉప జిల్లాల స్థాయిలోని అధికార వర్గాలతో లోతుగా చర్చించారు. ఇళ్ల సమాచారాన్ని సేకరించడానికి లక్షలాది మానవ వనరులను మోహరించడంపైనా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశామని అధికార వర్గాలు వెల్లడించాయి.

తొలి విడత జనగణనకు కార్యాచరణ ప్రణాళిక

‘గృహాల లిస్టింగ్, గణన’ కోసం 2026 ఏప్రిల్ నుంచి దేశంలోని ప్రతీ ఇంటిని క్షేత్రస్థాయి సిబ్బంది ఎలా చేరుకోవాలి ? ఈక్రమంలో ఇంటి యజమానులను ఏయే ప్రశ్నలు అడిగి, ఎలాంటి సమాచారాన్ని సేకరించాలి ? ఈక్రమంలో మొబైల్ యాప్‌ను ఎలా వాడాలి ? డిజిటల్‌గా సమాచారాన్ని నమోదు చేసే క్రమంలో దోహదపడే భద్రతా ఫీచర్లు ఏమిటి ? సిబ్బందిని రాష్ట్ర, జిల్లా, ఉప జిల్లా స్థాయుల్లో ఎలా వినియోగించాలి ? ఈక్రమంలో అధికారులు ఎలా సమన్వయం చేసుకోవాలి ? అనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఇటీవలే జరిగిన ప్రీ- టెస్ట్ ప్రక్రియ దోహదపడిందని అధికార వర్గాలు తెలిపాయి. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు ఇళ్ల వివరాల సేకరణకు జరగనున్న క్లిష్టమైన సుదీర్ఘ కసరత్తుపై క్లారిటీకి రావడానికి ఈ ప్రీ-టెస్ట్ ఉపకరించిందని పేర్కొన్నారు. ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వెళ్లినప్పుడు భవనాల వివరాలు, ఇళ్ల సమాచారం, కనీస వసతుల (తాగునీరు, పారిశుద్యం, విద్యుత్ వంటివి) గురించి తెలుసుకొని ప్రత్యేక మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారన్నారు.

రూ.11,718 .24 కోట్లతో జనగణన

‘గృహాల లిస్టింగ్, గణన’ ముగిశాక రెండోవిడత జనగణన మొదలవుతుంది. ఇందులో భాగంగా మనదేశంలోని మంచుమయ ప్రాంతాల్లో జనాభా లెక్కల ప్రక్రియను 2026 సెప్టెంబరు నుంచి అక్టోబరు 1 వరకు నిర్వహిస్తారు. మంచుమయ ప్రాంతాల జాబితాలో జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. దేశంలోని అన్ని ఇతర ప్రాంతాల్లో జనగణన 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1 వరకు జరుగుతుంది. రూ.11,718 .24 కోట్లతో జనగణనను నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనకు డిసెంబరు 12నే ప్రధాని మోదీ సారధ్యంలోని కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈసారి జనగణనలో తొలిసారిగా కుల వివరాలను కూడా సేకరించనున్నారు. ఈమేరకు ఈ ఏడాది ఏప్రిల్ 30న కేంద్ర కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇది మన దేశంలో జరుగుతున్న 16వ జనగణన. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరుగుతున్న 8వ జనగణన ఇది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.