epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పాలమూరు–రంగారెడ్డిని పక్కనపెట్టేశారు

పాలమూరు–రంగారెడ్డిని పక్కనపెట్టేశారు
నీటి హక్కులను వదిలేశారు!
90 టీఎంసీలపై హక్కు కోల్పోయాం
ఏపీ నల్లమల్ల సాగర్‌తో తెలంగాణకు అన్యాయం
వట్టెం రిజర్వాయర్‌లో వేల కోట్ల అవినీతి ఆరోపణలు
జలవివాదాలకు శ్రీశైలం సోర్స్ే కారణం : కవిత

కాక‌తీయ‌, నాగర్‌కర్నూల్ : పాలమూరు–రంగారెడ్డిని పక్కనపెట్టి నీటి హక్కులను సైతం వ‌దిలేశారంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను తెలంగాణ‌ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను వదిలేశారు. జాగృతి జనం బాటలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించిన కవిత పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శ‌నివారం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో క‌విత ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్భంగా ఆమె వేర్వేరు కార్యక్ర‌మాల్లో మాట్లాడుతూ ప్ర‌భుత్వంపై, బీఆర్ ఎస్ నేత‌ల‌పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. కాళేశ్వరం మాదిరిగా పాలమూరు–రంగారెడ్డిని పరుగులు పెట్టించకపోవడం వల్ల తెలంగాణ 90 టీఎంసీల నీటి వాటాపై హక్కు కోల్పోయిందని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తయ్యి ఉంటే ఇప్పటికే అదనపు నీళ్లపై చట్టబద్ధమైన హక్కు వచ్చేదని అన్నారు. ఏపీ వరద నీళ్ల పేరుతో నల్లమల్ల సాగర్ నిర్మిస్తోందని, దాని వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కడుతున్నట్లే తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి సోర్స్‌ను శ్రీశైలం నుంచి తీసుకోవడం శాశ్వత జలవివాదాలకు కారణమవుతుందని స్పష్టం చేశారు. జూరాల నుంచి నీటి సోర్స్ తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. వట్టెం రిజర్వాయర్‌లో నల్లమట్టి పేరుతో తీసుకున్న 900 ఎకరాల భూములు ఇప్పటికీ కాంట్రాక్టర్ల చేతిలోనే ఉన్నాయని ఆరోపించారు. ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు. కొంచెం పనులతో పూర్తయ్యే ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఇది స్పష్టమైన అవినీతేనని వ్యాఖ్యానించారు.

జిల్లాకు రైలు మార్గం లేకపోవడం దారుణం..

నాగర్‌కర్నూల్ జిల్లాకు రైలు మార్గం లేకపోవడం దారుణమని, గద్వాల–మాచర్ల రైల్వే లైన్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యత స్థానిక ఎంపీ తీసుకోవాలని అన్నారు. అటవీ వనరులు, పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లెల తీర్థాన్ని ‘తెలంగాణ ఊటీ’గా అభివృద్ధి చేయవచ్చని సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన 550 టీఎంసీలను పూర్తిగా వినియోగించుకోలేకపోయామని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం ఇందుకు ప్రధాన కారణమని కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్న హక్కులనే వదులుకుందని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అవకతవకలపై జాగృతి తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా జాగృతి జనం బాట కొనసాగుతుందని, ప్రజల సమస్యలపై కమిటీల ద్వారా ఉద్యమాలు చేపడతామని కవిత తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలంటే జలహక్కులు, వనరుల పంపిణీ న్యాయంగా జరగాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.