epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ
జైలు డైరీ చదివానంటూ మద్దతు
వివాదంగా మారిన స్పందన
2020 దిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉమర్ ఖాలిద్ అరెస్టు

న్యూఢిల్లీ/న్యూయార్క్ : దిల్లీ అల్లర్ల కేసులో దాదాపు ఐదేళ్లుగా జైలులో ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి, కార్యకర్త ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జోరాన్ మమ్దానీ మద్దతుగా లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఖాలిద్ సోదరి వివాహం కోసం 14 రోజుల బెయిల్‌పై విడుదలకు కొద్ది రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. డిసెంబర్ 9న ఉమర్ ఖాలిద్ తండ్రి సయ్యద్ ఖాసిమ్ రసూల్ ఇల్యాస్ న్యూయార్క్‌లో మమ్దానీని సుమారు 25 నిమిషాల పాటు కలిశారు. 2023లో ఉమర్ ఖాలిద్ జైలు డైరీని చదివినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు ఇల్యాస్ తెలిపారు. “ఉమర్ జైల్లో ఉండటం గురించి తాను ఎప్పుడూ ఆలోచిస్తుంటానని, అతడికి బెయిల్ రావాల్సిన అవసరం ఉందని మమ్దానీ అన్నారు” అని ఇల్యాస్ వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం మమ్దానీ ఉమర్ ఖాలిద్‌కు వ్యక్తిగతంగా లేఖ రాశారు. “కోపాన్ని మన మనసును ఆక్రమించనివ్వకూడదన్న నీ మాటలు నన్ను ఆలోచింపజేస్తుంటాయి. నీ తల్లిదండ్రులను కలవడం ఆనందంగా ఉంది. మేమంతా నిన్నే ఆలోచిస్తున్నాం” అంటూ మమ్దానీ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మమ్దానీ తనను, ఉమర్ ఖాలిద్‌ను సామాన్యుల సమస్యల కోసం పోరాడిన వ్యక్తులుగా పోల్చారని ఇల్యాస్ చెప్పారు. “ఈ విషయంలో తాను ఏమి చేయగలనని మమ్దానీ అడిగితే, ప్రార్థించడమే సరిపోతుందని చెప్పాను” అని ఆయన తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సమయంలో తాను హాజరైనట్లు, న్యాయపరంగా సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆశిస్తున్నట్లు ఇల్యాస్ పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై బీజేపీ నేత గౌరవ్ భాటియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమర్ ఖాలిద్ కేసు భారత్‌కు సంబంధించిన అంతర్గత వ్యవహారమని, విదేశీ నేతల జోక్యం సరికాదని వ్యాఖ్యానించారు.

దిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్ అరెస్టు..

2020 ఫిబ్రవరిలో జరిగిన దిల్లీ అల్లర్లకు సంబంధించి ఉమర్ ఖాలిద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అల్లర్లలో 53 మంది మరణించారు. సోదరి వివాహానికి హాజరయ్యేందుకు డిసెంబర్ 16 నుంచి 29 వరకు అతడికి తాత్కాలిక బెయిల్ మంజూరైంది. ఇదిలా ఉండగా, అమెరికా కాంగ్రెస్ సభ్యులు జిమ్ మెక్‌గవర్న్, జేమీ రాస్కిన్ సహా మరో ఆరుగురు శాసనసభ్యులు భారత రాయబారి వినయ్ క్వాత్రాకు లేఖ రాసి, దిల్లీ అల్లర్ల కేసుల్లో నిందితులపై కొనసాగుతున్న దీర్ఘకాలపు ముందస్తు నిర్బంధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉమర్ ఖాలిద్ అరెస్టు విషయంలో విచారణ, న్యాయ ప్రక్రియ న్యాయసమ్మతతపై మానవ హక్కుల సంస్థలు, న్యాయ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని వారు పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.