epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డం వెనుక‌ గంభీర్ హస్తం?

రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డం వెనుక‌ గంభీర్ హస్తం?
సంచలన ఆరోపణలు చేసిన మనోజ్ తివారీ
అగార్కర్ నిర్ణయానికి ‘ఇన్‌పుట్స్’ ఎవరివి?

కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోహిత్ కెప్టెన్సీ తొలగింపులో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రభావం తప్పకుండా ఉండి ఉంటుందని తివారీ అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ధైర్యమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా పేరున్నా, రోహిత్ శర్మలాంటి సీనియర్ ప్లేయర్ విషయంలో ఆయన ఒంటరిగా ఈ నిర్ణయం తీసుకుని ఉండరని తివారీ అభిప్రాయపడ్డారు. ‘అజిత్ అగార్కర్ నాకు బాగా తెలుసు. ఆయన స్ట్రాంగ్ పర్సనాలిటీ. కానీ ఇంత పెద్ద మార్పు చేయాలంటే కోచ్ ఇన్‌పుట్స్ తప్పకుండా ఉంటాయి. ఎవరో ఒకరి సపోర్ట్‌తోనే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు’ అని తివారీ ఓ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యల ద్వారా గంభీర్ పాత్రపై పరోక్షంగా ఆరోపణలు చేశారు.

గెలిచిన కెప్టెన్‌ను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం?

రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2024 టీ20 వరల్డ్ కప్‌ను, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. వరుసగా టైటిల్స్ సాధించిన కెప్టెన్‌ను వన్డేల నుంచి తప్పించడం ఆశ్చర్యకరమని తివారీ వ్యాఖ్యానించారు. రోహిత్ శర్మ టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికినా, వన్డేల్లో మాత్రం పూర్తి ఫిట్‌గా ఉన్నాడని తివారీ తెలిపారు. 2027 వరల్డ్ కప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్న సమయంలో శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడం ద్వారా రోహిత్‌కు తగిన గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని తివారీ తెలిపారు. ‘రోహిత్‌ను ఇలా అవమానించడం చూసి వన్డే క్రికెట్ చూడాలన్న ఆసక్తే పోయింది. సెలెక్షన్‌లోనూ, కెప్టెన్సీ మార్పులోనూ ఎలాంటి క్రికెటింగ్ లాజిక్ కనిపించడం లేదు. స్పష్టత లేకపోవడమే వివాదాలకు కారణం’ అని ఘాటుగా విమర్శించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనుక గౌతమ్ గంభీర్ పాత్ర ఉందన్న ప్రచారం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఐపీఎల్ vs పీఎస్ఎల్..

ఐపీఎల్ vs పీఎస్ఎల్.. ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్ అప్రతిహత ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్‌షిప్‌లో ఐపీఎల్...

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..!

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..! రిటైర్మెంట్ నిర్ణ‌యంపై అశ్విన్ తాజాగా కామెంట్స్‌ అప్ప‌ట్లో...

బిగ్ ప్రైజ్‌మ‌నీ

బిగ్ ప్రైజ్‌మ‌నీ భారత జట్టుకు 131 కోట్ల నగదు బహుమతి బీసీసీఐ చరిత్రలోనే అతిపెద్ద...

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..!

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..! వ‌ర‌ల్డ్ ఫుట్ బాల్ టోర్నీపై ఫిఫా స్ప‌ష్ట‌త‌ టోర్నమెంట్...

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు ఆటగాళ్ల పేరుతో తప్పుడు వ్యాఖ్యలు వైరల్ క్రీడా సంస్థలు...

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ న్యూజిలాండ్...

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు కీలక...

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ..

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ.. అనిల్ కుంబ్లే భావోద్వేగ‌మైన పోస్టు..! కాక‌తీయ‌, స్పోర్ట్స్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.