epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్–బీజేపీ పాలనలో అభివృద్ధి శూన్యం

కాంగ్రెస్–బీజేపీ పాలనలో అభివృద్ధి శూన్యం
తెలంగాణను నిలబెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే
హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధ్వజం

కాకతీయ, హుజూరాబాద్ : గ్రామాలు, పట్టణాలకు నిజమైన అభివృద్ధి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని, కాంగ్రెస్–బీజేపీ పాలనల్లో ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా జరగలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. గురువారం మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి 12, 14, 24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయనకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటి గురించి ప్రశ్నిస్తే తనపై కేసులు పెట్టి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. వీణవంక జాతరకు వెళ్లినప్పుడు పోలీసులు తనను అడ్డుకున్నారని, తనను అడ్డుకోవడం వరకు పరవాలేదని, కానీ భార్యా బిడ్డలను అడ్డుకోవడం మాత్రం అన్యాయమని మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడే విషయంలో తాను ఎవరికీ భయపడబోనని స్పష్టం చేశారు.

కేసీఆర్ పాలనలోనే మౌలిక వసతులు

ఇళ్ల ముందు రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు సహా అన్ని మౌలిక సదుపాయాలు కేసీఆర్ హయాంలోనే ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, పింఛన్లు, కల్యాణ లక్ష్మి, కంటి వెలుగు వంటి కీలక పథకాలను నిలిపివేసిందని తీవ్రంగా విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, పింఛన్ల పెంపు, ధాన్యానికి బోనస్, విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీల్లో ఒక్కదాన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఇందుకు నిదర్శనంగా ప్రజల ముందు బాకీ కార్డులను ప్రదర్శించారు. ప్రస్తుతం యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్–బీజేపీ అభ్యర్థులు డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన కౌశిక్‌రెడ్డి, ప్రజలు మాత్రం ఆ ప్రలోభాలకు లొంగకూడదని పిలుపునిచ్చారు. డబ్బులు తీసుకున్నా సరే కారు గుర్తుకే ఓటు వేయాలని సూచించారు. కారు గుర్తు అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించే బలం వస్తుందని అన్నారు. ప్రజలకు అవసరం వచ్చిన ప్రతిసారీ తాను అండగా నిలుస్తానని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.