epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రేవంత్‌ రెడ్డినే తగులబెట్టించాడు

రేవంత్‌ రెడ్డినే తగులబెట్టించాడు
ప‌థ‌కం ప్ర‌కారం ఆధారాలు లేపేసిండు
ఓటుకు నోటు కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్లాన్‌
ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర
బుడ్డ బిల్డింగ్‌లో మంటలు ఆర్పడానికి మూడు గంటలా?
సాక్ష్యాలన్నీ మాయం చేయడానికి పోలీసులు సహకారం
బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డినే ల్యాబ్‌ను తగులబెట్టించాడని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఆధారాలు నాశనం చేసి కేసు నుంచి బయటపడాలని రేవంత్‌ రెడ్డి స్వయంగా కుట్ర పన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ఆధారాలు లేపేసిండని విమర్శించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మేమంతా మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఉండగా రేవంత్‌ రెడ్డి ఈ కుట్ర చేశారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు జగద్విదితమని కేటీఆర్‌ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 2015లో ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చి రూ.50లక్షల బ్యాగుతో కెమెరాల ముందు దొరికాడని గుర్తుచేశారు. ఈ కేసు నుంచి బయటపడటానికే రేవంత్‌ రెడ్డి కుట్ర చేశాడని అన్నారు. ఓటుకు నోటు కేసు విచారణ న్యాయస్థానంలో తుది దశకు వచ్చిందని తెలిపారు. చివరి దశలో ఆధారాలు మాయం చేయడానికి పన్నిన కుట్ర అని అనుమానం వ్యక్తం చేశారు.

చలికాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయా?

దొంగతనం చేసి దొరికిపోవడం రేవంత్‌ రెడ్డికి అలవాటే అని కేటీఆర్‌ విమర్శించారు. అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి? చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతాయా అని ఆయన నిలదీశారు. చలికాలం పొద్దున 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందట.. రేవంత్‌ రెడ్డి చెప్పే మాటలు మనం నమ్మాలా అని ప్రశ్నించారు. ఇది చేయించబడిన అగ్ని ప్రమాదం అని అన్నారు. తన క్రిమినల్‌ మనస్తత్వంతో రేవంత్‌ రెడ్డినే ల్యాబ్‌ను తగులబెట్టించాడని తెలిపారు.

బుడ్డ బిల్డింగ్‌లో మంటలు ఆర్పడానికి మూడు గంటలు పట్టిందా ?

నేరాల విచారణలో ఫోరెన్సిక్‌ కీలక విభాగమని కేటీఆర్‌ తెలిపారు. వేలాది కేసుల వివరాలు అగ్గికి బుగ్గి అయ్యాయని పేర్కొన్నారు. ఎంతోమంది క్రిమినల్స్‌ తప్పించుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీజీఎఫ్‌ఎస్‌ఎల్‌ ప్రకటన తూతూ మంత్రంగా ఉందని తెలిపారు. ఏం నష్టం జరగలేదంటూ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఇన్‌స్పెక్టర్‌ నిజాయితీగా పనిచేశాడని చెప్పారు. ఉదయం 10 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్లు ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంగా రాశారని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల దాకా మంటలు అదుపు చేయలేదని.. బుడ్డ బిల్డింగ్‌లో మంటలు ఆర్పడానికి మూడు గంటలు పట్టిందా అని ప్రశ్నించారు. సాక్ష్యాలన్నీ మాయం చేయడానికి పోలీసులు సహకరించారని అన్నారు. మూడు అంతస్తుల భవనంలో మంటలు ఆర్పడానికి మూడు గంటలు పడుతుందంటే నమ్మాలా అని ప్రశ్నించారు. మొదటి అంతస్తులో మంటలు ఆర్పడానికే మూడు గంటలా అని కేటీఆర్ నిలదీశారు.

మీడియాను మేనేజ్‌ చేసి తిమ్మిని బమ్మి చేశారు

ముఖ్యమైన కేసుల సమాచారం అంతా మొదటి అంతస్తులోనే ఉందని తెలిపారు. ఉదయం 10 గంటలకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ఎవరూ డ్యూటీలో లేరట.. మీడియాను మేనేజ్‌ చేసి తిమ్మిని బమ్మి చేశారని మండిపడ్డారు. ఏం తప్పు జరగలేదని అని ఒక ఇన్‌స్పెక్టర్‌ చెప్పారని తెలిపారు. సర్వర్‌ రూమ్‌ కూడా కాలిపోయిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారని చెప్పారు. సర్వర్‌లు కాలబెట్టినంక ఇంకేం ఉంటుందని కేటీఆర్‌ ప్రశ్నించారు. కుట్ర విజయవంతంగా పూర్తిచేశారని అన్నారు. 50 కంప్యూటర్లు తగలబడ్డాయని చెబుతున్నారని తెలిపారు. ఒక ప్రభుత్వం తమ ప్రభుత్వ కార్యాలయాన్ని తామే కాల్చిపారేయడం దేశంలో ఎక్కడా జరగదని విమర్శించారు.

మేం సైంటిస్టులను తీసుకొని వస్తం.. మమ్మల్ని రానివ్వండి

దొంగ, చీకటి ఏకమయ్యాయని కేటీఆర్‌ విమర్శించారు. ముఖ్యమంత్రే దొంగ అని అన్నారు. కేంద్రంతో రేవంత్‌ రెడ్డి ఇన్ని రోజులు మేనేజ్‌ చేసుకున్నాడని తెలిపారు. అమిత్‌ షా కాళ్లు పట్టుకుని అడుక్కున్నాడని పేర్కొన్నారు. చివరకు సాక్ష్యాధారాలను మాయం చేసే డెడ్లీ కుట్ర చేసిండని అన్నారు. ఇందులో కుట్రను కేంద్రం నిగ్గుతేల్చాలని కోరారు. రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇది కుట్రపూరితంగా జరిగిందే.. ప్రమాదం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వేల కేసుల ఆధారాలు బుగ్గి చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు. నేరగాళ్లు, రేపిస్టులు, దుర్మార్గులకు శిక్ష పడే అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మేం సైంటిస్టులను తీసుకొని వస్తం.. మమ్మల్ని రానివ్వండి అని కోరారు. సీఎం రేవంత్‌ రెడ్డితో లాలూచీ లేకపోతే.. కేంద్రం ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ వచ్చి ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని అంటాడని.. బడే భాయ్‌, ఛోటే భాయ్‌ బంధం లేకపోతే వెంటనే విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి కుంభకోణాన్ని మేం బయటపెట్టినం.. సీఎం బామ్మర్ది పాత్ర ఉందని బయటపెట్టినం.. కానీ కేంద్రం విచారణ జరపడం లేదని తెలిపారు. దారుణ నేరానికి ఒడిగట్టిన నేరగాడిని బయటపెట్టాలని ఆయ‌న డిమాండ్‌ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.