epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాల్సిందే

ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాల్సిందే
మార్చి 31 డెడ్‌లైన్… పెండింగ్ బిల్లులు క్లియ‌ర్ చేయాలి
ఇసుక, సిమెంట్ చౌకగా అందేలా ప్రత్యేక చర్యలు
హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి గౌతమ్ ఆదేశాలు
లబ్ధిదారులతో నేరుగా స‌మావేశం
కరీంనగర్‌లో నిర్మాణాలపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ

కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మార్చి 31లోగా పూర్తి చేసి లబ్ధిదారులు గృహప్రవేశాలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి గౌతమ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరు, కోతి రాంపూర్ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణాల పురోగతిని సమగ్రంగా తనిఖీ చేసి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణ ఖర్చులు, ఇసుక, ఇటుక, కంకర ధరలు, బిల్లుల చెల్లింపుల పరిస్థితిపై వివరాలు ఆరా తీశారు. ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేయడంతో సొంతింటి కల నెరవేరుతోందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

బిల్లులు పెండింగ్ లేకుండా వెంటనే చెల్లింపులు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని, ఎక్కడా పెండింగ్‌లో ఉంచవద్దని ఎండి గౌతమ్ అధికారులకు ఆదేశించారు. మొదటి దశలో ప్రారంభించిన ఇండ్ల తుది పనులు మార్చి 31లోగా పూర్తి కావాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వారం లేదా పదిరోజులకు ఒకసారి బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణ సామగ్రి ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక, ఇటుక, సిమెంట్ వంటి సామగ్రి చౌకగా లభించేలా డీలర్లతో చర్చించి సమీప క్వారీల నుంచి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ధరలు తగ్గితే లబ్ధిదారులకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపై ప్రత్యేక సమీక్ష

తర్వాత కరీంనగర్‌లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో సమావేశమయ్యారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని, పెండింగ్ పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి సంతృప్తికరంగా ఉందని కలెక్టర్ పమేలా సత్పతి, సంబంధిత అధికారులను ఎండి గౌతమ్ అభినందించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఈఈ నరసింహ చారి, తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.