epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆస్ప‌త్రికొస్తే కొత్త రోగాలు

ఆస్ప‌త్రికొస్తే కొత్త రోగాలు
కొత్త‌గూడెం ఆస్ప‌త్రిలో శుభ్ర‌త అధ్వానం
ఆవరణలో ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు
వార్డుల పక్కనే ఆసుపత్రి వ్యర్థాలు..!
పర్యవేక్షణ సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు
తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల పారిశుధ్య సమస్యలతో విమర్శలకు గురవుతోంది. జిల్లాలో ప్రధాన ఆసుపత్రిగా పేరుగాంచిన ఈ దవాఖానలో రోగుల వార్డుల పక్కనే ఆసుపత్రి వ్యర్థాలను కుప్పలుగా వేయడం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు ఈ పరిస్థితిని చూసి కలవరపడుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే, వ్యర్థాల కారణంగా కొత్త వ్యాధులు సోకే ప్రమాదం ఉందని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వార్డుల పక్కనే చెత్త కుప్పలు

ఆసుపత్రి ఆవరణలో డస్ట్‌బిన్లు ఉన్నప్పటికీ వ్యర్థాలను వాటిలో వేయకుండా ఎక్కడపడితే అక్కడ కుప్పలుగా వేయడం గమనార్హం. ముఖ్యంగా రోగుల వార్డుల సమీపంలోనే వైద్య వ్యర్థాలు పడేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా దుర్వాసన వ్యాపిస్తూ రోగులు, సందర్శకులకు అసౌకర్యం కలిగిస్తోంది. ఆసుపత్రి జనరేటర్ సమీపంలో కూడా చెత్త పేరుకుపోయి రోజులు గడుస్తున్నా వాటిని తొలగించే చర్యలు కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

పారిశుధ్యంపై అధికారుల నిర్లక్ష్యం

జిల్లాలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఈ దవాఖానలో పారిశుధ్య నిర్వహణ దారుణంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు. పర్యవేక్షణ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నదని విమర్శిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో పచ్చదనం కనిపించాల్సిన చోట చెత్త కుప్పలు కనిపించడం బాధాకరమని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వైద్య శాఖ అధికారులు స్పందించి ఆసుపత్రి పరిసరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని, తగిన సంఖ్యలో డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసి వ్యర్థాలను సక్రమంగా నిల్వ చేసి తరలించే చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోగులకు ఆరోగ్యాన్ని అందించే ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.