epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు
ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ
ధర్మారంలో క్రీడా మైదానం ఏర్పాటు
నందిమేడారం 100% సోలార్ గ్రామంగా అభివృద్ధి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కాక‌తీయ, పెద్ద‌ప‌ల్లి : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అనర్హులైన కొందరు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని కబ్జాకు గురైన సర్కారు భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో ఇంటింటికి సోలార్ పథకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మండలంలోని నర్సింగాపూర్, ఖీలావనపర్తి, ధర్మారం గ్రామాల్లో ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమించుకున్నట్లు గుర్తించామని రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆక్రమణకు గురైన భూములను గుర్తించి పట్టాలు రద్దు చేయాలని మంత్రి సూచించారు. స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములను అర్హులైన పేదలకు అందజేస్తామని తెలిపారు.

ధర్మారంలో క్రీడా మైదానం

ధర్మారం మండల కేంద్రంలో క్రీడా మైదానం కోసం కేటాయించిన స్థలాన్ని 15 రోజుల్లో చదును చేసి క్రికెట్, వాలీబాల్, వాకింగ్ ట్రాక్‌కు అనుగుణంగా అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశించారు. ధర్మారం మండలంపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని మంత్రి తెలిపారు.

నందిమేడారం 100% సోలార్ గ్రామం

ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటికి సోలార్ పథకాన్ని గ్రామస్తులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో నందిమేడారం గ్రామాన్ని 100 శాతం సోలార్ గ్రామంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. తొలి విడతలో గృహ అవసరాల కోసం 1486 విద్యుత్ కనెక్షన్లకు రెండు కిలోవాట్ల సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తున్నామని, రెండో విడతలో 628 వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామాన్ని సంపూర్ణ సోలార్ గ్రామంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.51 కోట్లు విడుదల చేసిందని, విద్యుత్ లైన్ల మార్పిడి కోసం రూ.36 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. అలాగే గ్రామంలో తాగునీటి సమస్యలు లేకుండా బోర్ బావులు తవ్వించామని, నందిమేడారం గ్రామంలో 80 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.