epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గగనతలం మూత… విదేశీ ప్రయాణికుల కష్టాలు

గగనతలం మూత… విదేశీ ప్రయాణికుల కష్టాలు
పూర్తిగా నిలిచిపోయిన గల్ఫ్ దేశాల మార్గాలు
వందలాది విమానాలు రద్దు.. అమెరికా, యూరప్ ప్రయాణికుల అవస్థలు
దుబాయి, దోహాలో నిలిచిపోయిన వేలాది మంది
చుక్కలనంటుతున్న విమాన టికెట్ ధరలు
ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకులాట
ప్రత్యేక విమానాలపై ఆశలు

కాకతీయ, నేషనల్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ గగన రవాణాపై తీవ్రంగా పడింది. గల్ఫ్ దేశాలు గగనతలాన్ని మూసివేయడంతో విమాన సర్వీసులు దాదాపు స్థంభించాయి. ఇరాన్, ఇరాక్, బహ్రైన్, ఇజ్రాయిల్, జోర్దాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాలు పూర్తిగా విమానాల రాకపోకలకు నిషేధిత ప్రాంతాలుగా మారాయి. దీంతో భారతదేశం నుంచి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లాల్సిన వేలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి, ఢిల్లీ నగరాల నుంచి గల్ఫ్ మార్గం మీదుగా ప్రయాణించే వారు మధ్యలోనే చిక్కుకుపోయారు. దుబాయి, అబుదాబి, దోహా వంటి ప్రధాన మార్గమధ్య కేంద్రాల్లో అనేక మంది ప్రయాణికులు నిలిచిపోయి ఆందోళన చెందుతున్నారు. గల్ఫ్ మార్గం మూసివేయడంతో ప్రత్యామ్నాయ రూట్ల కోసం ప్రయాణికులు ప్రయత్నాలు ప్రారంభించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, ఉక్రెయిన్ మార్గం మీదుగా యూరప్ చేరుకుని అక్కడి నుంచి అమెరికాకు వెళ్లే మార్గాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ మార్గాల్లో కూడా పరిమిత విమానాలే ఉండటంతో సీట్ల కొరత తలెత్తింది. ప్రయాణ ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

దుబాయిలోనే వేలాది మంది నిలిచిపోయారు

గల్ఫ్ దేశాల్లో ట్రాన్సిట్ వీసాలపై ప్రయాణిస్తున్న వారు మధ్యలోనే నిలిచిపోయారు. హోటళ్లలో గదులు దొరకక ఇబ్బందులు పడుతున్నవారూ ఉన్నారు. ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాల్లో కూడా ప్రయాణికుల రద్దీ పెరిగింది. కొందరు టికెట్లు మార్చుకోవడానికి గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో సీట్లు పరిమితంగా ఉండటంతో టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని ట్రావెల్ వర్గాలు చెబుతున్నాయి. అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారు అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి రావొచ్చని అంచనా. కొంతమంది ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నారు. అమెరికా, యూరప్ నుంచి భారత్‌కు రావాల్సిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యప్రాచ్య మార్గం నిలిచిపోవడంతో ప్రత్యక్ష విమానాలపై ఒత్తిడి పెరిగింది. కొన్ని దేశాలు ప్రత్యేక విమానాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. యుద్ధ పరిస్థితి మరింత విషమిస్తే అంతర్జాతీయ గగన రవాణాపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం విదేశాలకు వెళ్లాల్సిన వారు అధికారిక ప్రకటనలను గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. పరిస్థితి చల్లబడే వరకు విమాన సర్వీసులు పరిమితంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.