epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇరాన్ సూపర్ దాడి చేసిందా..?

ఇరాన్ సూపర్ దాడి చేసిందా..?
టెల్ అవీవ్‌పై క్షిపణుల వర్షం
హైఫా రక్షణ కేంద్రాలే లక్ష్యం
ప్రతిదాడులతో ఇజ్రాయెల్ కౌంటర్
రంగంలోకి దిగిన హెజ్బుల్లా సేన‌లు
ప్రాంతీయ యుద్ధ భయం పెరుగుతోంది

కాకతీయ, నేషనల్ డెస్క్ : ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు మూడో రోజుకు చేరుకుని మరింత ఉధృతమయ్యాయి. పరస్పరం క్షిపణి దాడులు కొనసాగుతుండగా, పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. తాజా దాడిని ఇరాన్ “సూపర్ దాడి”గా ప్రకటించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ కూడా వెంటనే ప్రతిస్పందిస్తూ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళాలు విడుదల చేసిన ప్రకటనలో టెల్ అవీవ్‌లోని ప్రభుత్వ సముదాయం, హైఫాలోని రక్షణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించినట్లు పేర్కొన్నాయి. ఈ దాడికి ప్రత్యేక కోడ్ పేరును కూడా వెల్లడించాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నామని, దాని ఫలితాలపై స్పష్టత లేదని ఇరాన్ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దళాలు ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు సమాచారం. టెహ్రాన్ పరిసరాల్లో పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు పలు క్షిపణులను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నష్టం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అమెరికా స్థావరాలపై అప్రమత్తత

గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై కూడా ముప్పు ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కువైట్, బహ్రెయిన్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్ఫ్ సముద్రంలో నౌకాదళ కదలికలు పెరిగినట్లు సమాచారం. అమెరికా తమ సైనికులకు అదనపు రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఘర్షణ మరింత విస్తరించే అవకాశముందనే ఆందోళన పెరుగుతోంది. ఇరాన్ తనపై జరిగిన దాడులకు తగిన ప్రతిస్పందన ఇస్తున్నామని ప్రకటిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ భద్రతకు భంగం కలిగించే ఏ చర్యనైనా కఠినంగా తిప్పికొడతామని స్పష్టం చేసింది. రెండు దేశాల ప్రకటనలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి.

హెజ్బుల్లా రంగంలోకి

లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బుల్లా సంస్థ కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు ప్రారంభించినట్లు సమాచారం. ఉత్తర సరిహద్దుల్లో అలర్ట్ సైరన్లు మోగుతున్నాయని వార్తలు చెబుతున్నాయి. ఇరాన్‌కు మద్దతుగా ఉన్న ఈ సంస్థ రంగంలోకి దిగడంతో పరిస్థితి ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో రోజుకి చేరుకున్న ఈ ఘర్షణల్లో ఎక్కడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. అంతర్జాతీయ సమాజం మాత్రం ఇరు దేశాలు శాంతి మార్గం వైపు రావాలని పిలుపునిస్తోంది. ఐక్యరాజ్య సమితి సహా పలువురు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో యుద్ధ మబ్బులు కమ్ముకున్నాయి. పరిస్థితి మరింత విషమిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. చమురు సరఫరా మార్గాలు, వాణిజ్య కార్యకలాపాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇకపై పరిణామాలు ఎలా మలుపుతీసుకుంటాయన్నది అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లబడతాయా, లేక మరింత తీవ్రమవుతాయా అన్నది వచ్చే రోజుల్లో తేలనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.