epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు
కేంద్ర కమిటీ ఘాటు హెచ్చరిక
ఆర్థిక వ్యవహారాలపై అభ్యంతరాలు
కుటుంబ ప్రాధాన్యంపై విమర్శలు
పక్షపాత నిర్ణయాలపై అసంతృప్తి
రహస్య లేఖ బహిర్గతంతో వర్గపోరు స్పష్టత
రాష్ట్ర మహాసభల ముందు ఉద్రిక్తత

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో: తెలంగాణ వామపక్ష రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కేంద్ర కమిటీ జారీ చేసిన అభిశంసన లేఖ బయటకు రావడం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ లేఖలో రాష్ట్ర స్థాయి కీలక నేత తమ్మినేని వీరభద్రంపై పలు ఆరోపణలు ప్రస్తావించబడినట్లు పార్టీ వర్గాల్లో సమాచారం వెలుగులోకి వచ్చింది. పార్టీ రాజ్యాంగంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇచ్చే అధికారిక హెచ్చరికనే అభిశంసనగా పరిగణిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు భావించినప్పుడు విచారణ అనంతరం కేంద్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుంది. తమ్మినేనిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాతే ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.

లేఖలోని ఆరోపణలు ఇవే..

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఆర్థిక లావాదేవీల విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు నాయకులతో కలిసి నిర్వహించిన వ్యవహారాల్లో పారదర్శకత లోపించిందనే విమర్శలు వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు కూడా లేఖలో ఉన్నట్లు సమాచారం. పార్టీలో తనకు అనుకూలమైన వర్గానికే పదవులు కేటాయించి, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని పక్కన పెట్టారనే ఫిర్యాదులు కూడా కేంద్ర కమిటీ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన నేతగా మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని లేఖలో సూచించినట్లు చెబుతున్నారు.

లేఖ బహిర్గతంపై ఆందోళన

ఇలాంటి అంతర్గత పత్రాలు సాధారణంగా బయటకు రావు. కానీ ఈసారి లేఖ బహిర్గతం కావడం పార్టీలో వర్గపోరును బహిరంగం చేసింది. తమ్మినేని అనుచరులు మాత్రం వ్యతిరేక వర్గమే ఉద్దేశపూర్వకంగా లీక్ చేసిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శి స్థాయి నేతపై కేంద్ర కమిటీ ఘాటు అభిప్రాయాలు వ్యక్తం చేయడం, అది బయటపడడం పార్టీ ప్రతిష్టకు దెబ్బతీసిందని సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. తమ్మినేని ప్రస్తుతం అనారోగ్య కారణాలతో కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఈ పరిణామం ఆయన పదవిలో కొనసాగడంపై అనుమానాలు రేకెత్తించింది. త్వరలో జరగబోయే రాష్ట్ర మహాసభల ముందు ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉంది. క్రమశిక్షణ, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తమ బలంగా చెప్పుకునే వామపక్ష పార్టీలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం రాజకీయంగా మాత్రమే కాక సిద్ధాంతపరంగానూ చర్చకు దారి తీసింది. పార్టీ నాయకత్వం ఈ అంశాన్ని ఎలా పరిష్కరిస్తుందో అన్నదానిపై అందరి దృష్టి నిలిచింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.