epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తహసీల్దార్‌గా… అవినీతి తిమింగలం!

తహసీల్దార్‌గా… అవినీతి తిమింగలం!
ఏసీబీ దాడుల్లో కోట్ల అక్రమాస్తుల గుట్టు రట్టు
గజ్వేల్ తహసీల్దార్‌పై అక్రమాస్తుల కేసు
కరీంనగర్‌లో ఇళ్లు, ఫ్లాట్లు, ఖాళీ స్థలాల గుర్తింపు
కార్లు, బంగారు నగలు, లక్షల్లో నగదు స్వాధీనం
అధికార పదవిని అడ్డంగా పెట్టుకొని అక్రమ సంపాదన
నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలింపు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ప్రభుత్వ పదవిని అడ్డంగా ఉపయోగించి కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండల తహసీల్దార్ కమటం శ్రవణ్ కుమార్‌పై ఆదాయ వనరులకు మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం నిర్వహించిన సోదాల్లో భారీ స్థాయిలో అక్రమ సంపాదన వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ పట్టణానికి చెందిన ఈ అధికారి అధికార పదవిలో ఉండగానే అనుమానాస్పద మార్గాల్లో కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఏసీబీ అధికారులు నిందితుడి నివాసంతో పాటు మరో రెండు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో కరీంనగర్ పట్టణంలో రెండు ఇళ్లు, ఆరు ఫ్లాట్లు కలిగిన ఒక అపార్ట్‌మెంట్‌, నాలుగు ఖాళీ స్థలాలు బయటపడ్డాయి. ఈ స్థిరాస్తుల విలువ సుమారు రూ.2,47,33,540గా అధికారులు అంచనా వేశారు. ఇక చరాస్తుల పరంగా రెండు ద్విచక్ర వాహనాలు, ఒక నాలుగు చక్రాల వాహనం, బంగారు నగలు, గృహోపకరణాలు, భారీ నగదు గుర్తించారు. రెండు ద్విచక్ర వాహనాల విలువ రూ.1,60,000గా, ఒక నాలుగు చక్రాల వాహనం విలువ సుమారు రూ.30 లక్షలుగా నమోదు చేశారు. బంగారు నగలు సుమారు రూ.4,20,000 విలువగా ఉండగా, గృహోపకరణాల విలువ రూ.15,66,000గా అంచనా వేశారు. అదనంగా రూ.11,90,000 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో బయటపడిన స్థిర, చరాస్తుల మొత్తం విలువ సుమారు రూ.4 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అధికారిక అంచనాల కంటే మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. ప్రభుత్వ పదవిని దుర్వినియోగం చేసి ఈ ఆస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో లభించిన పత్రాలు సూచిస్తున్నాయని తెలిపారు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరచి న్యాయ నిర్బంధానికి తరలించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అక్రమ సంపాదనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.