epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

 గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

కలెక్టర్ గరిమ అగ్రవాల్

చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో పశువులకు టీకాల పంపిణీ

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక పనుల పరిశీలన

కాకతీయ సిరిసిల్ల టౌన్: పశువుల సంరక్షణకు పెంపకందారులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆద్వర్యంలో పాల కేంద్రం ఆవరణలో మంగళవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ గరిమ అగ్రావాల్ హాజరై ప్రారంభించారు. పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు.పాల కేంద్రాన్ని పరిశీలించి గ్రామంలో ఎన్ని పాడి పశువులు ఉన్నాయి? ఎన్ని లీటర్ల పాలు వస్తాయి? ఎక్కడ విక్రయిస్తారు అనే వివరాలను పాల కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.అలాగే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామంలో కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు.రోగాల బారిన పడిన పాడి పశువులు పాలు తక్కువ ఇస్తాయని వివరించారు. పాలు, పాల ఎగుమతుల పై ఆ ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. పెంపకందారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. పెంపకందారులు తమ జీవాల ఆరోగ్య సంరక్షణ, ఆర్థికంగా నష్ట పోకూడదనే ఉద్దేశంతో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ఉచితంగా వేయిస్తుందని పేర్కొన్నారు. పెంపకందారులు ముందస్తుగా టీకాలు వేయించి ఆ రోగాల బారి నుంచి తమ జీవాలను రక్షించాలని సూచించారు.

అన్ని పాడి పశువులు, ఎద్దులు, దూడలకు పశువుల పెంపకందారులు, రైతులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, జిల్లాలో 97 వేల జీవాలు ఉన్నాయని, పశు వైద్య డాక్టర్లు, సిబ్బంది 26 టీమ్ లుగా ఏర్పడి వచ్చే నెల ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాలు వేస్తారని తెలిపారు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో జిల్లాలోని అన్ని గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు చేపడుతున్నారని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ ఆద్వర్యంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసి గృహ ప్రవేశానికి సిద్దం చేయాలని ఆదేశించారు. మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులు వేగంగా పనులు చేపట్టి జూన్ 2వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధికారి ఆద్వర్యంలో యువతకు 5కే రన్, ఉపాధి కల్పన శాఖ ఆద్వర్యంలో జాబు మేళాలు చేపడుతారని కలెక్టర్ తెలిపారు. వ్యవ సాయ, విద్యాశాఖ, అటవీ శాఖ, డీఆర్డీఓ వివిధ శాఖల ఆద్వర్యంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా చేపడుతున్న పనుల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

గాలికుంటు వ్యాధి బారిన పడిన జీవాల శరీర ఉష్ణోగ్రత 104º F – 1060 F పెరిగి పశువులు నీరసించి పోతాయని, పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని, వాటి నోరు అలాగే గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడి, 24 గంటల్లో చితికిపోయి పొక్కులు, పుండ్లుగా మారి నొప్పి వలన పశువులు మేత నీరు తీసుకోక నీరసించి చనిపోయే ప్రమాదం ఉందని పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. పశువుల పాకలను శుభ్రంగా ఉండాలని సూచించారు. టీకాలు వేసి గుర్తింపు కొరకు చెవి పోగు వేయించి ఆ వివరాలు భారత్ పశుధాన్ యాప్ లో నమోదు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దూది మనీషా, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఎంపీడీఓ రాధ, పశు వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.