epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

22 నుంచి రైతుభరోసా..

22 నుంచి రైతుభరోసా..

70 లక్షల మంది ఖాతాల్లోకి రూ.3,590 కోట్ల నగదు బదిలీ

ఇప్పటికే అన్న‌దాత‌ల అకౌంట్లోకి రూ. 18 వేల కోట్లు

ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు జమ

అన్న‌దాత‌ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి గుడ్ న్యూస్‌

రైతును రాజు చేయ‌డ‌మే ల‌క్ష్యమ‌ని పున‌రుద్ఘాట‌న‌

రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన సీఎం .. మంత్రులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: రైతులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి ‘రైతు భరోసా’పై రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా కింద అందించే పెట్టుబడి సాయాన్ని ఈ నెల 22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. రైతు భరోసా కింద మూడు విడతల్లో మొత్తం రూ.9వేల కోట్ల నగదు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈమేర‌కు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హైదరాబాద్​లోని రవీంద్ర భారతిలో భాష, సంస్కృతి, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన పంచాంగం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్నదాతలు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటి చేస్తామని పునరుద్ఘాటించారు. కర్షకులు ఆత్మగౌరవంతో బతికేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్న ఆయన రైతు భరోసా ద్వారా ఇప్పటికే 18 వేల కోట్లను ఇచ్చామన్నారు. ఈనెల 22 నుంచి రైతుభరోసా కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

ఈనెల 22 నుంచి రైతుభరోసా

సాగునీటి ప్రాజెక్టులు, రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో తెలంగాణ ప్రతిష్ఠను పెంచుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి రైతుల సమస్యలను పరిష్కారించామని వెల్లడించారు. ఫలితంగా ఈనాడు రైతులు సంతోషంగా తమ యాజమాన్య హక్కులను పొందుతున్నారని తెలిపారు. సాదాబైనామాలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపిస్తామన్నారు. ఉగాది అనేది రైతుల పండుగని అభివర్ణించారు. కర్షకుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషిచేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, రాష్ట్రమంతులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, జూపల్లి, పొన్నం, కొండా సురేఖలు పాల్గొన్నారు. ఉగాది వేడుకల సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటలకు రవీంద్రభారతిలో కవి సమ్మేళనం ఉంది.

మూడు విడతలు.. రూ.9,000 కోట్లు

రైతు భరోసా నిధుల బదిలీని ప్రభుత్వం మూడు విడతలుగా చేయనుంది. తొలి విడతగా ఈనెల 22 నుంచి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకిరూ.3,590 కోట్ల నగదు బదిలీ చేయనున్నారు. మొదటి రోజు ఒక ఎకరం భూ విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు జమ చేస్తారు. అనంతరం మూడు వారాల తర్వాత రెండో విడతలో రూ.2,650 కోట్లు జమ చేయనుంది. ఏప్రిల్‌ నెలాఖరులోపు మూడో విడతగా మిగిలిన రూ.2,760 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. కాగా, రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రైతుల తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేశారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ప్రభుత్వమని మరోసారి రుజువైందని తుమ్మల పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.