epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డీజీపీ ఎదుట మావోయిస్టుల స‌రెండ‌ర్‌

డీజీపీ ఎదుట మావోయిస్టుల స‌రెండ‌ర్‌
45మంది మావోయిస్టుల లొంగుబాటు
పీఎల్జీఏ బెటాలియన్‌కు భారీ దెబ్బ
కీలక కమాండర్లు సహా లొంగుబాటు
36 తుపాకులు, 1007 తూటాలు, 800 గ్రాముల బంగారం స్వాధీనం
నిరంతర ఆపరేషన్ల ఫలితమే ఈ పరిణామం
పునరావాస ప్యాకేజీలతో ప్ర‌భుత్వం ముంద‌కు : డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుదీర్ఘ కాలంగా అరణ్యాల్లో సాయుధ పోరాటం కొనసాగిస్తున్న సిపిఐ (మావోయిస్టు)కు చెందిన 42 మంది కేడర్లు తెలంగాణ పోలీసుల ఎదుట ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ ఘటనను భద్రతా వ్యవస్థలో కీలక మలుపుగా అధికారులు భావిస్తున్నారు. లొంగిన వారిలో పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్ సోడి మల్ల @ కేశాల @ నిఖిల్, తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు చాప నారాయణ @ గజేందర్ @ మధు, కడిరన్ను @ మంతు వంటి కీలక నాయకులతో పాటు ఇతర కేడర్లు కూడా ఉన్నారు. వీరంతా గత కొన్నేళ్లుగా వివిధ అరణ్య ప్రాంతాల్లో సాయుధ కార్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకు సవాలు విసిరిన వారేనని అధికారులు తెలిపారు. లొంగుబాటు సమయంలో కేడర్లు తమ వద్ద ఉన్న భారీ ఆయుధ సామగ్రిని కూడా అప్పగించారు. మొత్తం 36 తుపాకులు, 1007 తూటాలు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, 800 గ్రాముల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన ఆయుధాల్లో ఐదు ఏకే-47 రైఫిళ్లు, నాలుగు ఎస్ఎల్ఆర్‌లు, మూడు ఇన్సాస్ రైఫిళ్లు, ఆరు .303 రైఫిళ్లు, ఒక స్టెన్ గన్, పది సింగిల్ షాట్ గన్స్, రెండు రివాల్వర్లు, ఒక బీజీఎల్ గన్ ఉన్నాయి.

కీలక నాయకత్వం కూలింది

లొంగుబాటులో కీలక నాయకులు ఉండటం మావోయిస్టు సంస్థకు పెద్ద దెబ్బగా మారింది. ముఖ్యంగా సోడి మల్ల @ కేశాల @ నిఖిల్ పీఎల్జీఏ బెటాలియన్ కార్యకలాపాలను నడిపించిన వ్యక్తిగా గుర్తింపు పొందినవాడు. అలాగే చాప నారాయణ @ గజేందర్ @ మధు తెలంగాణ రాష్ట్ర కమిటీకి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా వ్యవహరించినట్లు సమాచారం. కడిరన్ను @ మంతు కూడా సాయుధ దళాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ముగ్గురు సహా ఇతర కేడర్లు లొంగిపోవడంతో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్ దాదాపు నిర్వీర్యమైందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ స్థాయిలో కూడా కార్యకలాపాలు క్షీణించినట్లు తెలుస్తోంది.

నిరంతర ఆపరేషన్ల ఫలితమే ఈ పరిణామం : డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి

ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ, “గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న వ్యూహాత్మక ఆపరేషన్లు, ఇంటెలిజెన్స్ ఆధారిత చర్యల వల్లే ఈ భారీ లొంగుబాటు సాధ్యమైంది. మావోయిస్టు కేడర్‌లో భయం పెరిగింది. అభివృద్ధి, పునరావాస అవకాశాలు చూసి వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు” అని పేర్కొన్నారు. “మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా అణచివేయడమే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం పని చేస్తోంది. లొంగుబాటు చేసుకునే వారికి ప్రభుత్వం పూర్తి భద్రత, పునరావాసం కల్పిస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2024 నుంచి 2026 వరకు మొత్తం 761 మంది మావోయిస్టు కేడర్లు లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. అదే కాలంలో 302 తుపాకులు స్వాధీనం చేసుకోవడం పోలీసుల ఆపరేషన్ల తీవ్రతను సూచిస్తోందన్నారు. లొంగుబాటు చేసిన కేడర్లను ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. కమిటీ స్థాయిని బట్టి రూ.1 లక్ష నుంచి రూ.20 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలు అందజేయనున్నారు. ఆయుధాలతో లొంగిన వారికి అదనపు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నారు. మొత్తం రూ.1.93 కోట్ల ప్యాకేజీ కేడర్లకు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యోగావకాశాలు, స్వయం ఉపాధి పథకాలు, విద్యా సదుపాయాలు కూడా కల్పిస్తామని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.