epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం

ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్యం

తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తాం..

పులిగుండాలలో టూరిజం అభివృద్ధికి రూ. 4 కోట్లు

హరిత నిధి నుంచి రూ. 2 కోట్లు.. సీఎస్ఆర్ నుంచి మ‌రో 2 కోట్లు

పర్యాటకుల కోసం కనకగిరి నుంచి డబుల్ రోడ్డు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఏకో టూరిజం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోందని, తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయాలనేది తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజవర్గంలోని పులిగుండాల ఏకో టూరిజం ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. అక్క‌డ ఏర్పాటు చేసిన కాటేజీలు, బోటింగ్, జంగిల్ సఫారీలను కూడా ఈ సందర్భంగా ఉపముఖ్యతను బట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ప్రసంగంలోనే రాష్ట్రంలో ఏకో-టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా పేర్కొన్నట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలోని కనకగిరి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి బడ్జెట్‌లోనే నిధులు కేటాయించినట్లు వివరించారు. ​పులిగుండాల చెరువు వద్ద టూరిజం అభివృద్ధికి రూ. 4 కోట్ల అవసరమని స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ చెప్పారు.

వెంట‌నే ప్ర‌తిపాధ‌న‌లు

ఈమేరకు అవసరమైన నిధుల్లో రూ. 2 కోట్ల రూపాయలు హరిత నిధి నుంచి, మిగిలిన 2 కోట్లు రూపాయలను సీఎస్ఆర్ నిధుల నుంచి ఇస్తానని ప్రకటించారు. ​పర్యాటకుల రాకపోకలకు వీలుగా కనకగిరి నుంచి డబుల్ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీని కోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. ఈ పనులకు సంబంధించి ఒక నిర్దిష్టమైన టైం ఫ్రేమ్ రూపొందించి, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానిక గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటకులు రావడం వల్ల స్థానిక హోటళ్లు, ఇతర చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రకృతిని ఏమాత్రం దెబ్బతీయకుండా, సహజ సిద్ధమైన వాతావరణంలోనే పర్యాటక అభివృద్ధి జరగాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

గొప్ప టూరిస్ట్ స్పాట్‌

రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ప్రజా ప్రభుత్వం ధృడ సంకల్పంతో ముందుకు వెళుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న పులిగుండాల ప్రాజెక్ట్, కనకగిరి గుట్టలు, కల్లూరు గుట్టలను కలిపి ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ​భవిష్యత్తులో ఈ ప్రాంతం కేవలం రాష్ట్రంలోనే కాకుండా, దేశ పటంలోనే ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంత అభివృద్ధికి అవసరమైన అన్ని నిధులను తక్షణమే మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. పర్యాటక ప్రాంతాన్ని మనందరి ఆస్తిగా భావించి, దీనిని అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజలకు, దేశానికి గర్వకారణంగా చూపిద్దామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రితోపాటుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెటి శ్రీనివాస రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పీసీసీఎఫ్ అధికారి సువర్ణ, సీసీఎఫ్ భీమానాయక్, ఫీఎఫ్ఓ ఖమ్మం విక్రంసింగ్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు నాయుడు సత్యనారాయణ, రాయల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.