భక్తిశ్రద్ధల మధ్య స్వర్ణ దర్శనం
కాకతీయ, హనుమకొండ : హనుమకొండలోని చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవాలయం లో జరుగుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం 2026 బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆదివారం ఆలయాన్ని సందర్శించి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న స్వర్ణకు ప్రధాన అర్చకులు, ఈవో, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు మరియు శేషవస్త్రాలను వారికి బహూకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం భక్తులతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

