జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్‌కు ఘన సన్మానం
తొలిసారి నెక్కొండ రాక.. ఘన స్వాగతం పలికిన శ్రేణులు
జిల్లా అధ్యక్షుడికి బూత్ ఏజెంట్ల జాబితా అందజేత
కాకతీయ, నెక్కొండ: వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ అయూబ్‌కు నెక్కొండలో శనివారం ఘన స్వాగతం లభించింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా నెక్కొండకు విచ్చేసిన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. నెక్కొండ మార్కెట్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ ఆధ్వర్యంలో అయూబ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు.. నెక్కొండ బ్లాక్ పరిధిలోని నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం మండలాలకు సంబంధించిన బూత్ ఏజెంట్ల వివరాల జాబితాను జిల్లా అధ్యక్షుడికి అందజేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదునూరి సాయికృష్ణ, ఓబీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొనిజేటి బిక్షపతి మరియు మూడు మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

