epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నో స్టాక్‌!

నో స్టాక్‌!

తెలంగాణలో మరోసారి పెట్రోల్ కొరత

బంకుల వద్ద వాహనదారుల బారులు

పెట్రోల్‌, డీజిల్ కోసం ఎగ‌బ‌డుతున్న జ‌నం

గంట‌ల త‌ర‌బ‌డి వేచి చూడాల్సిన ప‌రిస్థితి

సీఎన్‌జీ కోసం ఆటోలు క్యూ..

ఇంధ‌న కొర‌త‌తో ప‌లుచోట్ల బంకులు బంద్‌

ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌.. అపోహ‌లొద్దంటున్న అధికారులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: రాష్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్‌ కష్టాలు మొదలయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్‌ కొరత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. రాత్రి నుంచి పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ కొరత వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. స్టాక్‌ ఉన్న పెట్రోల్‌ బంకుల్లో పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో కొన్నాళ్లుగా సీఎన్‌జీ కొరత కొనసాగుతోంది. సీఎన్‌జీ కోసం బంకుల ముందు ఆటోలు బారులు తీరాయి. పలు జిల్లాల్లోనూ పెట్రోల్‌, డీజిల్‌ దొరకటం లేదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాల్లోనూ పెట్రోల్‌ బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల పెట్రోల్‌ లభ్యత ఉండగా, డీజిల్‌కు కొరత ఉంది.

సమస్యను త్వరగా పరిష్కరించాలని వేడుకోలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాత్రి నుంచి అనేక పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో బంకులు మూసివేశారు. దీంతో ఉద్యోగులు, ఇతర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన వారు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. మరికొన్ని పెట్రోల్‌ బంకుల్లో మాత్రమే ఇంధనం లభించడంతో ఆ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ పట్టణంలో 12 పెట్రోల్ బంక్​లు ఉండగా ఉదయం నుంచి అన్ని బంక్​లలో నో స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో లారీలు, ట్రాక్టర్లు, రైతులు, వ్యాపారులు, క్రషర్ మిల్లులు, వరి కోత, మొక్క జొన్న నూర్పిడి యంత్రాల దారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ వద్ద నిల్వ చేసుకున్న డీజిల్ అయిపోవడంతో వ్యవసాయ, ఆర్ధిక కార్యకలాపాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు

అపోహలకు గురికావద్దు

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్​పీజీ గ్యాస్ సరఫరాకు నిల్వలు సమృద్దిగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురికావద్దని సూచించారు. రోజుకి 9,574 కిలో లీటర్ల పెట్రోల్, 14,457 కిలో లీటర్ల డీజిల్ మొత్తం 24,000 కిలో లీటర్ల పైగా పెట్రోల్, డీజిల్​లను బంకుల ద్వారా వాహనదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే వినియోగదారులకు 2 లక్షల 22 వేలకు పైగా ఎల్​పీజీ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ సరఫరా, గ్యాస్ డెలివరీలపై పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1967 ను సంప్రదించాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.