రేపే పది ఫలితాలు
మధ్యాహ్నం 2 గంటలకు విడుదల
మార్చి 14న ప్రారంభం ..
ఏప్రిల్ 1 నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం
తేలనున్న 5.15 లక్షల మంది భవితవ్యం
ఏర్పాట్లు పూర్తిచేసిన ఎస్ఎస్సీ బోర్డు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి ఫలితాలు రేపే (బుధవారం) వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. ఈమేరకు ఎస్ఎస్సీ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 13న ముగిశాయి. సుమారు 5.15 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభంకాగా.. ఏప్రిల్ 23వ తేదీతో ప్రక్రియ ముగిసింది. మార్కుల క్రోడీకరణ పూర్తి చేయటంతో.. అనుకున్న దానికంటే ముందుగానే ప్రకటించాలని విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే..
కాగా, ఫలితాల వెల్లడి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో కసరత్తు కొనసాగుతోంది. ఇక, ఫలితాల వెల్లడి పైన ఈ ఏడాది తెలంగాణ SSC బోర్డు విద్యార్ధుల కోసం కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు వాట్సాప్‌లోనూ తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఇప్పటికే హాల్‌టికెట్లను సైతం వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించటంతో.. ఫలితాలను సైతం అదే విధంగా అందుబాటులోకి తీసుకు రావాలని డిసైడ్ అయింది. వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే 80969 58096 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్ అని టైప్‌చేసి హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆ వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. 29వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

