epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పిల్లల భవిష్యత్తుకు ‘బాల భరోసా’ రక్షణ కవచం

పిల్లల భవిష్యత్తుకు ‘బాల భరోసా’ రక్షణ కవచం
అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పౌష్టికాహారం, మెరుగైన విద్య
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: మంత్రి కొండా సురేఖ
ఓసిటీ స్టేడియంలో ఘనంగా ‘బాల భరోసా’ వేడుకలు

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించడం అత్యవసరమని, వారి రక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హనుమకొండలోని ఓసిటీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ‘బాల భరోసా’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి ఆమె పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు నిర్వహిస్తున్న ‘చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ – డ్రగ్స్‌కు నో’ థీమ్ వారం వేడుకల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

అంగన్‌వాడీలను సద్వినియోగం చేసుకోవాలి..
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. పిల్లల్లో శారీరక, మానసిక దృఢత్వానికి సరైన పోషణ ఎంతో అవసరమన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూచించారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని వినియోగించుకోవాలని కోరారు. సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు.

ఆరోగ్య పరీక్షలతో లోపాల గుర్తింపు: కలెక్టర్
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. చిన్నారులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ఎదుగుదల లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి, మెరుగైన చికిత్స అందించవచ్చని తెలిపారు. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, వైద్య మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.