భద్రకాళి బండ్ పై అభివృద్ధి పనులకు శ్రీకారం
ప్రారంభించిన మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ
రూ. 84.20 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో పనులు
కాకతీయ, వరంగల్ : వరంగల్ మహా నగరంలోని భద్రకాళి ట్యాంక్ బండ్ పై స్మార్ట్ సిటీ నిధులు రూ.84.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ మంగళవారం ప్రారంభించారు. బండ్ కు ఒక వైపు భద్రకాళి దేవాలయం మరోవైపు పద్మాక్షి ఆలయంతోపాటు సిద్దేశ్వరుల గుట్ట భద్రకాళి బండ్ పర్యాటకానికి వన్నె తెస్తాయని, నగరానికి మణిహారంగా ఉన్న భద్రకాళి బండ్ ప్రజలకు అందుబాటులోకి తీసుక రావడం సంతోషదాయకం అని మంత్రులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, బల్దియా ఇంచార్జి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ కలెక్టర్ డా. సత్య శారద తదితరులు పాల్గొన్నారు.

