epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కరెంట్ కోతలు – ప్రజల వెతలు

కరెంట్ కోతలు – ప్రజల వెతలు
పాల్వంచ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ ధర్నా
మాజీ మంత్రి వనమా నేతృత్వంలో విద్యుత్ అధికారులకు వినతిపత్రం

కాకతీయ, కొత్తగూడెం: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు కరెంట్ కోతలు, అవస్థలు తప్పడం లేదని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు విమర్శించారు. తెలంగాణ ప్రజలకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి.. రోజుకు 15 నుండి 20 సార్లు కరెంట్ నిలిపివేస్తూ ప్రజలను, రైతులను, వ్యాపారస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ కరెంట్ కోతలకు నిరసనగా మంగళవారం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు నేతృత్వంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పాల్వంచ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజూ అప్రకటిత కరెంట్ కోతలు విధిస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ హ‌యాంలో ఎలాంటి కోత‌ల్లేవు..

గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు ఎలాంటి కరెంట్ కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించిన విషయాన్ని గుర్తుచేశారు. పాల్వంచ పరిధిలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు (కేటీపీఎస్) ఉన్నప్పటికీ.. స్థానికంగా కరెంట్ కోతలు విధించడం అత్యంత దారుణమన్నారు. ఒకవైపు ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూనే.. మరోవైపు కోతలతో సామాన్య ప్రజలను వంచిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలంతా ఈ వైఫల్యాలను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడే నాణ్యమైన విద్యుత్ సరఫరా తిరిగి అందుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నిరసనకారులు విద్యుత్ కార్యాలయంలోని అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కనగాల బాలకృష్ణ, మల్లెల రవిచంద్ర, పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్ మూర్తి, ముత్యాల ప్రవీణ్, కార్పొరేటర్లు గుగులోత్ రాంబాబు, గుణ చరిత్, నాయకులు కాల్వ ప్రకాష్, పత్తిపాటి శ్రీను, జూపల్లి దుర్గాప్రసాద్, బట్టు మంజుల, కిలారు చిన్న, కొంచెర్ల రామకృష్ణ, చందు నాయక్, నారికట్ల శేఖర్, దాసరి సురేష్, హర్ష, వీరన్న, ఆనంద్, శంకర్, నాయుడు, నాగసత్యం, చంద్రశేఖర్, చింతలచెరువు దుర్గాప్రసాద్, ఆనంద్, ఫిరోజ్, సంపత్ రెడ్డి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.