epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చిరు ప్రాయంలోనే.. కొండంత కష్టం!

చిరు ప్రాయంలోనే.. కొండంత కష్టం!
క్యాన్సర్ మహమ్మారితో మౌనిక పోరాటం
మూడో దశలో వ్యాధి.. చికిత్సకు తప్పని లక్షల వ్యయం
ప్రైవేటు ఉద్యోగాల ఆదాయం సరిపోక దంపతుల అవస్థలు
పసిపిల్లల భవిష్యత్తు తలచుకుని కుమిలిపోతున్న తలిదండ్రులు
దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితురాలి కుటుంబం

కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : ఆ దంపతులది ఇద్దరు పసిపిల్లలతో సాగిపోతున్న అందమైన చిన్న ప్రపంచం. ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ తమ రెక్కల కష్టంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో విధి వారిపై కన్నెర్ర చేసింది. అనూహ్యంగా ఆ ఇంటి ఇల్లాలు మౌనిక (32)ను క్యాన్సర్ మహమ్మారి ఆవహించింది. ఈ పిడుగులాంటి వార్త ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతున్న తీరు, ఆ కుటుంబం పడుతున్న మానసిక, ఆర్థిక వేదన వర్ణనాతీతంగా మారింది.

ఛిద్రమవుతున్న కలల ప్రపంచం
వరంగల్‌కు చెందిన మధుసూదన్, మౌనిక దంపతులకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఉన్నంతలో సంతోషంగా ఉన్న ఈ కుటుంబంలో మౌనికకు క్యాన్సర్ సోకడంతో అంతా చీకటిమయమైంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఒమేగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాధి మూడవ దశలో (స్టేజ్-3) ఉండటంతో వైద్యులు తక్షణమే చికిత్స ప్రారంభించాలని, అందుకు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వెల్లడించారు. ఉన్న కొద్దిపాటి పొదుపును ఇప్పటికే మందులకు, పరీక్షలకు ఖర్చు చేసిన ఆ కుటుంబం.. ఇప్పుడు రాబోయే భారీ ఖర్చును తలచుకుని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

చేయూత కోసం ఎదురుచూపు

వైద్యానికి అయ్యే భారీ వ్యయాన్ని భరించే ఆర్థిక స్తోమత లేక మౌనిక భర్త మధుసూదన్ దాతల సాయం కోసం అర్థరిస్తున్నారు. ఓవైపు భార్య ఆరోగ్య పరిస్థితి, మరోవైపు ఇద్దరు పసిపిల్లల పోషణ భారమై ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. “ఒక చిన్న సహాయం మా కుటుంబాన్ని నిలబెడుతుంది.. నా భార్యను మాకు దక్కించుకుంటుంది” అని ఆయన వేడుకుంటున్నారు. మౌనిక ప్రాణాలను కాపాడేందుకు దాతలు ఉదార హృదయంతో స్పందించాలని కోరుతున్నారు. సహాయం చేయాలనుకునే వారు మధుసూదన్ నంబర్ 9398711733 కు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా నగదు పంపించి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.