epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్‌ నేతల్లో వణుకు

కాంగ్రెస్‌ నేతల్లో వణుకు
‘రైతు సంగ్రామ సభ’ విజయవంతంతో ఆగ‌మాగం
రైతు డిక్లరేషన్‌ అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలం
ఇచ్చిన మాట తప్పడం కాంగ్రెస్‌ నైజం!
రుణమాఫీపై సవాల్‌ను స్వీకరిస్తారా?
కాంగ్రెస్ నేత‌ల‌కు, మంత్రుల‌కు మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స‌వాల్‌

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : వరంగల్‌లో కేటీఆర్ నిర్వహించిన ‘రైతు సంగ్రామ సభ’ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ నేతల్లో వణుకు మొదలైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను 900 రోజులు గడుస్తున్నా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేవలం ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకే కేసీఆర్ కుటుంబాన్ని తిడుతున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. “బీజేపీ నేతలు రాహుల్ గాంధీ పుట్టుకను ప్రశ్నిస్తే మొదట ఖండించింది కేసీఆర్. అలాంటి నాయకుడిని విమర్శించడం మహేష్ గౌడ్ అహంకారానికి నిదర్శనం” అని పేర్కొన్నారు. కేటీఆర్ 2009 నుంచి ఎమ్మెల్యేగా, పదేళ్లు మంత్రిగా పనిచేశారని.. కనీసం ఒక్కసారి కూడా గెలవని మహేష్ గౌడ్ తన స్థాయి తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. కేటీఆర్ తెలంగాణను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు.

రుణమాఫీపై బహిరంగ సవాల్
రైతులను మోసం చేసినందుకే కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని వేముల స్పష్టం చేశారు. “రాష్ట్రంలో వంద శాతం రుణమాఫీ జరిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా.. దానికి మహేష్ గౌడ్ సిద్ధమా?” అని సవాల్ విసిరారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామన్న హామీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. వరి పంటకు రూ. 500 బోనస్ ఊసే లేదని, రైతు బంధును కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. కేటీఆర్ మీటింగ్ పెట్టిన ప్రతిసారీ భయంతో ఎకరాల వారీగా నిధులు విడుదల చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే..
రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ఒక్కటై బీఆర్‌ఎస్‌పై దాడులకు తెగబడుతున్నాయని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌లో పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్‌ను అడ్డుకుని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ ‘గూండాలు’ దాడి చేయడం హేయమన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒక్కటయ్యారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న 890 మంది రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కె. వాసుదేవ రెడ్డి, అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కె. కిషోర్ గౌడ్, ఉపేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.