epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బండి సంజయ్ కుమారుడిపై  పీడీ యాక్ట్ పెట్టాలి!

బండి సంజయ్ కుమారుడిపై  పీడీ యాక్ట్ పెట్టాలి!
బాలికపై అఘాయిత్యం జ‌రిగినా ప్ర‌భుత్వ చ‌ర్య‌లేవీ
ఇదేనా బీజేపీ ‘బేటీ బచావో’ నినాదానికి నిదర్శనమా? 
హనీ ట్రాప్ కాదు.. అది హేయమైన చర్య
సంజయ్ కొడుకేమీ జేమ్స్ బాండ్ కాదు.. అతడో ఖైదీ నెంబర్ 786″ 
స్టేషన్ బెయిల్ వచ్చేలా బలహీనమైన సెక్షన్లు పెట్టారు
దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం
కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలి
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
కాకతీయ, హైదరాబాద్ : “తెలంగాణలో గత 15 రోజులుగా శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. పోలీసు శాఖ కేవలం తూతూమంత్రంగా పనిచేస్తోంది” అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో నమోదైన పోక్సో  కేసు వివరాలను వెల్లడించారు. ఈ అఘాయిత్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బండి సాయి భగీరథ్ ఓ  మైనర్ బాలికను ఛాటింగ్ ద్వారా వేధించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడుసార్లు అత్యాచార యత్నం చేశారని ఆరోపించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మత్తు మందు కలిపి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. బండి సంజయ్ తన కుమారుడిని వెనకేసుకొస్తూ బాధితురాలి కుటుంబాన్ని బెదిరిస్తున్నారని, ఇది బీజేపీ ‘బేటీ బచావో’ నినాదానికి నిదర్శనమా? అని ప్రశ్నించారు. ఈ కేసులో స్టేషన్ బెయిల్ వచ్చేలా బలహీనమైన సెక్షన్లు పెట్టడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు.
హనీ ట్రాప్ కాదు.. అది హేయమైన చర్య
బీజేపీ సోషల్ మీడియా ఈ ఘటనను ‘హనీ ట్రాప్’ అంటూ ప్రచారం చేయడాన్ని ప్రవీణ్ కుమార్ తప్పుబట్టారు. “హనీ ట్రాప్ అనేది దేశ భద్రతకు సంబంధించిన గూఢచారుల మీద చేసేది. బండి సంజయ్ కొడుకేమీ జేమ్స్ బాండ్ కాదు.. అతడో ఖైదీ నెంబర్ 786” అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఒత్తిడితోనే బాధితురాలి తల్లిదండ్రులపై నిర్మల్ మరియు కరీంనగర్‌లో అక్రమ కేసులు పెట్టించారని, పోలీసులే వారికి ఈ ఐడియా ఇచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసును సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాల‌ని ప్ర‌వీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మేజిస్ట్రేట్ ముందు మైనర్ బాలిక వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలి. పేట్ బషీరాబాద్, కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ల సీసీ టీవీ ఫుటేజీలను భద్రపరచాల‌న్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డిల మధ్య ఉన్న అవినాభావ సంబంధం వల్లే కేంద్ర మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.