epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పండని కాయ.. ‘పలారం’!

పండని కాయ.. ‘పలారం’!
మామిడి ధరల్లో వ్యాపారుల మాయాజాలం
బేరంలో ఒక ధర.. దిగుమతి వేళ మరో ధర
వరంగల్‌ పండ్ల మార్కెట్‌లో దారుణ పరిస్థితులు
రైతులకు తప్పని ‘కమీషన్’ కోతలు
సీజన్‌ ప్రారంభంలో రూ.1.30 లక్షలు పలికిన క్వింటా
ఇప్పుడు రూ.70 వేలకే ‘జెండాపాట’
లక్ష రూపాయల సరుకుపై రూ.10 వేల కమీషన్
అడ్డూఅదుపు లేని మధ్యదళారుల దోపిడీ
అధికారుల పర్యవేక్షణ శూన్యం.. వ్యాపారుల కనుసన్నల్లోనే మార్కెట్ ధరలు

కాకతీయ, వరంగల్ : పండు కాయ పలారం అంటారు.. కానీ వరంగల్ పండ్ల మార్కెట్‌లో పండని మామిడి కాయలను ధరల రూపంలో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు పలారంలా పంచుకుతింటున్నారు. అడ్డగోలు ధరలతో రైతన్నకు చుక్కలు చూపిస్తున్నారు. పడరాని పాట్లు పడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకొస్తే, దళారులు చెప్పిన ధరకే తలొగ్గాల్సిన దుస్థితి నెలకొంది. సరుకు వెనక్కి తీసుకెళ్లలేక, వేరే మార్కెట్‌కు తరలించే స్తోమత లేక అన్నదాతలు అడ్డికి పావుశేరు చొప్పున అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీజన్ సాకుతో.. ధరలకు ‘కోత’

ఈ ఏడాది మార్చిలో మామిడి సీజన్ ప్రారంభమైనప్పుడు మార్కెట్ కళకళలాడింది. తొలి రోజుల్లో క్వింటా కాయ ధర రూ.1.30 లక్షల వరకు పలికింది. కానీ, ప్రస్తుతం సరుకు రాక పెరిగిందనే సాకుతో ధరను అమాంతం రూ.70 వేలకు తగ్గించేశారు. కాయ తెంపి మార్కెట్‌కు తరలించాలంటే ఒక్కో ట్రాలీకి రూ.20 వేల వరకు ఖర్చవుతోంది. ఈ క్రమంలో సరుకును తిరిగి తీసుకెళ్లడం సాధ్యం కాకపోవడంతో, కమీషన్ ఏజెంట్లు నిర్ణయించిన తక్కువ ధరకే రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది. ఏజెంట్లు చెప్పిందే రేటు.. పెట్టిందే సరుకు అన్నట్లుగా మార్కెట్‌లో పరిస్థితి తయారైంది.

వందకు పది.. అడ్తీదారుల జేబులు ‘నిండు’!

వరంగల్ మామిడి మార్కెట్‌లో ‘వందకు పది’ అనే సూత్రం అమలవుతోంది. అంటే వంద రూపాయల సరుకు అమ్ముడుపోతే, అందులో పది రూపాయలు కమీషన్ ఏజెంట్ల జేబులోకి వెళ్లాల్సిందే. లక్ష రూపాయల సరుకుపై ఏకంగా రూ.10 వేల కమీషన్ వసూలు చేస్తున్నారు. రోజుకు కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతున్న ఈ మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్లు రోజుకు లక్షల్లో దండుకుంటున్నారని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం మార్కెట్ అధికారుల సమక్షంలో ధర నిర్ణయించాల్సి ఉండగా, ఇక్కడ కేవలం వాచ్‌మన్‌లు మాత్రమే కనిపిస్తున్నారు. అధికారులు లేకపోవడంతో దళారులదే రాజ్యమైంది.

దిగుమతి వేళ.. కొత్త కొర్రీలు!

ధర నిర్ణయం దగ్గర మొదలయ్యే దోపిడీ, సరుకు దిగుమతి అయ్యే వరకు కొనసాగుతూనే ఉంది. బేరం కుదిరిన తర్వాత సరుకును వ్యాపారులు దిగుమతి చేసుకునే సమయంలో కొత్త కొర్రీలు పెడుతున్నారు. కాయ పగిలిందనో, దెబ్బ తగిలిందనో, మరకలు ఉన్నాయనో సాకులు చెబుతూ.. కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు కోత విధిస్తున్నారు. అప్పటికే సరుకు అంతా దిగుమతి అయి ఉండటంతో, వ్యాపారులు చెప్పిన ‘తగ్గింపు’ ధరకు అంగీకరించక రైతులకు మరో మార్గం లేకుండా పోతోంది. అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల కుమ్మక్కుతో మామిడి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మార్కెట్‌లో పారదర్శకత తీసుకురావాలని అన్నదాతలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.