నాగవల్లి దళాలతో నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ
కాకతీయ,గీసుగొండ: నాగవల్లి దళాలతో అలంకరించిన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువై ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు వైదిక మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం స్వామివారిని నాగవల్లి దళాలతో (తమలపాకులతో) ప్రత్యేకంగా అలంకరించారు.జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు శ్రీహర్ష, ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

