epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అంజన్న కోసం అడుగులు.. దర్శనం కోసం నిరీక్షణ!

అంజన్న కోసం అడుగులు.. దర్శనం కోసం నిరీక్షణ!
పాదయాత్రగా కొండగట్టు చేరుతున్న మాలాదారుల ఆవేదన
మండుతున్న ఎండలో ‘బొబ్బలెక్కే’ నడక..
అల‌సిపోయినా క్యూలైన్లలో గంటల తరబడి నిల‌బ‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి
‘త్వరిత దర్శనం కల్పించాలంటూ’ వైరల్ అవుతున్న భక్తుడి విజ్ఞప్తి
అధికారుల తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలు
ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని భక్తుల డిమాండ్

కాకతీయ, కరీంనగర్ : హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న సన్నిధికి భక్తుల రద్దీ పోటెత్తుతోంది. మండుతున్న ఎండలను లెక్కచేయకుండా, కాళ్లు బొబ్బలెక్కినా లెక్కచేయక.. “జై హనుమాన్” నామస్మరణతో వందల కిలోమీటర్లు పాదయాత్రగా వస్తున్న హనుమాన్ మాలాదారులు కొండగట్టుకు చేరుకుంటున్నారు. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. అయితే, రోజుల తరబడి కఠిన దీక్షతో, నియమ నిష్ఠలతో నడచి వచ్చిన భక్తులకు ఆలయానికి చేరుకున్నాక గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఎదురవుతుండటం ఆవేదన కలిగిస్తోంది.

కదిలిస్తున్న భక్తుడి వీడియో.. ‘ప్రత్యేక’ గుర్తింపు ఏది?

ఈ నేపథ్యంలో ఓ హనుమాన్ దీక్షపరుడు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. “రోజుల తరబడి కఠిన నియమాలతో నడిచి వస్తాం.. అన్నం, నిద్ర కూడా మానేసి స్వామి దర్శనానికి వస్తే, ఇక్కడ మళ్లీ గంటల పాటు క్యూలో నిలబడాల్సి వస్తోంది” అంటూ ఆయన భావోద్వేగంతో చేసిన విజ్ఞప్తి భక్తులను కదిలిస్తోంది. పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక దర్శనం లేదా ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఈ వీడియోతో మరోసారి తెరపైకి వచ్చింది. ఎండలో నడిచి వచ్చిన శారీరక శ్రమను గుర్తించి, వారికి త్వరితగతిన దర్శనం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మద్దతు

వైరల్ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అంజన్నపై అపారమైన భక్తితో కష్టాన్ని భరించి నడిచి వచ్చే మాలాదారులకు ఆలయ అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. కేవలం క్యూలైన్లే కాకుండా తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, త్వరిత దర్శనం వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. “అన్ని కిలోమీటర్లు నడిచి వచ్చిన వారికి మరో గంటల పాటు నిలబడే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అధికారులకు మానవత్వం లేదా?” అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కొండగట్టు ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉన్న దృష్ట్యా అధికారులు తక్షణమే అదనపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాదయాత్రగా వచ్చే భక్తులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రత్యేక లైన్ల ద్వారా దర్శనం కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భక్తుల విశ్వాసానికి గౌరవం ఇచ్చి, స్వామివారి దర్శనం సులభతరం చేసేలా ఆలయ కమిటీ నిర్ణయాలు తీసుకోవాలని భక్తకోటి కోరుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.