epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అంత్య పుష్కరాలకు విద్యుత్ ఏర్పాట్లు పూర్తి

అంత్య పుష్కరాలకు విద్యుత్ ఏర్పాట్లు పూర్తి
18 ట్రాన్స్‌ఫార్మర్లు, డబుల్ ఫీడింగ్‌తో సిద్ధం
పుష్కరాల పొడవునా నిరంతరాయ సరఫరా
150 మంది సిబ్బందితో  24 గంట‌ల సేవ‌లు
ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
కాకతీయ, వరంగల్ బ్యూరో : ప్రతిష్టాత్మక సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా విద్యుత్ శాఖ తరఫున అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీజీఎన్‌పీడీసీఎల్  సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. మే 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఈ పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా చిన్నపాటి అంతరాయం కూడా లేని నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ముందస్తుగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పుష్కరాల ప్రాంగణాలు, ఘాట్ల వద్ద పటిష్ట విద్యుత్ వ్యవస్థ కోసం రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేసినట్లు సీఎండీ వివరించారు. 330 ఎనిమిది మీటర్ల స్తంభాలు, 152 తొమ్మిది మీటర్ల స్తంభాలు, 8 పదకొండు మీటర్ల స్తంభాలను నూతనంగా నాటారు.  సుమారు 5 కిలోమీటర్ల మేర 11 కేవీ  లైన్, 12 కిలోమీటర్ల మేర ఎల్‌టీ  లైన్ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. లోడ్ ఇబ్బందులు రాకుండా మొత్తం 18 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులోకి తెచ్చారు.
ఒక ఫీడర్ ఆగినా.. మరో ఫీడర్ ద్వారా సరఫరా!
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన సరస్వతి దేవాలయం, టెంట్ సిటీ, వీఐపీ ఘాట్, మెయిన్ ఘాట్, హరిత హోటల్ తదితర ప్రాంతాలకు ప్రత్యేకంగా ‘డబుల్ ఫీడింగ్’ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. దీనివల్ల సాంకేతిక కారణాలతో ఒక ఫీడర్‌లో విద్యుత్ సరఫరా ఆగిపోయినా, తక్షణమే సెకండ్ల వ్యవధిలో మరో ఫీడర్ ద్వారా విద్యుత్ అందేలా ప్రత్యామ్నాయం సిద్ధం చేశారు. అత్యవసర బ్రేక్‌డౌన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కాళేశ్వరం, మహాదేవపూర్, 132 కేవీ కాటారం సబ్‌స్టేషన్ల వద్ద ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
‘రౌండ్ ది క్లాక్’ విధులు
పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు 16 కీలక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిరంతరం పర్యవేక్షించేందుకు 150 మంది సాంకేతిక సిబ్బందితో రౌండ్ ది క్లాక్   షిఫ్టుల వారీగా విధులు కేటాయించారు. ఈ బృందంలో 4 మంది డివిజనల్ ఇంజినీర్లు, 6 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు , 13 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు , 12 మంది సబ్ ఇంజినీర్లు, 13 మంది లైన్ ఇన్‌స్పెక్టర్లు, 9 మంది లైన్‌మెన్లు, 45 మంది అసిస్టెంట్ లైన్‌మెన్లు ఉన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని సీఎండీ పేర్కొన్నారు. ఘాట్లు, పూజా మండపాల సమీపంలో విద్యుత్ తీగలు ఉన్న చోట హెచ్చరిక టేపులు, సైన్ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు తడి బట్టలతో విద్యుత్ స్తంభాలను తాకరాదని, తీగలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యుత్ పరంగా ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా తక్షణమే ఫిర్యాదు చేసేందుకు 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.