epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల ధర్నా!

ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల ధర్నా!
కమిటీ చైర్మన్ పదవి నుంచి కేశవరావును తొలగించాలి
250 గజాల ఇంటి స్థలం, 25 వేల రూపాయల పింఛన్ ఇవ్వాలి
జూన్ 2 లోపు హామీలు నెరవేర్చకుంటే నిరసనలు తప్పవు 
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ  మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి
కాకతీయ, వరంగల్ సిటీ : తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వేసిన కమిటీకి చైర్మన్‌గా కేశవరావును నియమించడాన్ని ఉద్యమకారులు ఎవరూ ఒప్పుకోవడం లేదని, ఆయనను వెంటనే తొలగించి అర్హులైన ఉద్యమకారులలో ఒకరిని చైర్మన్‌గా నియమించాలని  కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కరీంబాద్‌లోని చెట్లవారిగడ్డ వద్ద వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని కేశవరావును చైర్మన్‌గా నియమించడం అధికార పార్టీకి వత్తాసు పలకడమేనని విమర్శించారు.
హామీల అమలులో కాలయాపన వద్దు
వరంగల్ నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి, ఉద్యమ నాయకులు అచ్చ విద్యాసాగర్ మాట్లాడుతూ ఎంతోమంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కేసులలో ఇరుక్కుని జైలు జీవితం గడిపారన్నారు. అటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అధికారం ఎటు ఉంటే అటువైపు వెళ్లే కేశవరావుకు చైర్మన్ పదవి ఇవ్వడం సబబు కాదన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా అర్హత కలిగిన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము, ప్రతి నెల 25 వేల రూపాయల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు.
ఉద్యమ విలేకరులను, ఫోటోగ్రాఫర్లను గుర్తించాలి
ఉద్యమంలో పాల్గొని మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ పథకాలు అందించాలని, ఉద్యమకారుల కేసుల వివరాలను పోలీస్ శాఖ ద్వారా సేకరించాలని కోరారు. ఆనాడు జరిగిన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విలేకరులను, ఫోటో, వీడియో గ్రాఫర్లను కూడా ఉద్యమకారులుగా గుర్తించాలన్నారు. జూన్ రెండో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అర్హులైన ఉద్యమకారులను గుర్తించి ప్రశంసా పత్రాలు ఇచ్చి గౌరవించాలని, లేనిపక్షంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో అండర్ రైల్వే గేట్ జేఏసీ కన్వీనర్ దిడ్డి నరేందర్, ఉద్యమ నాయకులు నార్ల గిరి, రమేష్, నహీంసంకు, నర్సింగం, నాగవెల్లి సాంబయ్య, మిట్టపల్లి రమేష్, అబ్దుల్ పాషా, శంకేసి లింగమూర్తి, కేతిరి రాజశేఖర్, మేకల ఎల్లయ్య, దిండిగాల సోమేశ్వర్, పరదేశి రాజేష్, అంకం దేవానంద్, కెంచ ఆనంద్, కాలే యాదయ్య, సోమ మధుకర్, బస్కే రాజేందర్, ఆవునూరు లక్ష్మి, ముసినిపల్లి జమున, కొలిపాక రమాదేవి, పల్లకొండ యాక లక్ష్మి, చిదురాల సుజాత, కొండపాక లక్ష్మి, సోమ ఉపేంద్ర, కె.సురేందర్, ఎం.రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.