epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆదివాసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు!

ఆదివాసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు!
ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సింహా మూర్తి
వలస గిరిజనేతరులకు ఆదివాసీ నవనిర్మాణ సేన హెచ్చ‌రిక‌
వెంకటాపురంలో భారీ రాస్తారోకో.. 2 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాకతీయ, ములుగు ప్రతినిధి : వలస గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని, స్థానిక ఆదివాసీలపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి హెచ్చరించారు. వెంకటాపురం గ్రామానికి చెందిన ఆదివాసీ తలండి రాంబాబు ఇంట్లోకి పట్టపగలే చొరబడి, వలస గిరిజనేతరుడి అనుచరులు ఆయనపైన, ఆయన కూతుర్లపై ఆదివారం దాడికి తెగబడ్డారు. ఈ ఘటనను యావత్తు ఆదివాసీ జాతిపై జరిగిన దాడిగా పేర్కొంటూ ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో మంగళవారం సుమారు మూడు వందల మందితో వెంకటాపురం ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనతో రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
అక్రమ నిర్మాణాలపై అధికారుల నిలదీత
ధర్నా స్థలానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్, సబ్ ఇన్స్పెక్టర్ కొప్పుల తిరుపతిరావు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా నిరసనకారులు వినలేదు. దీంతో తహసీల్దార్ వేణుగోపాల్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) జుమ్మిలాల్ అక్కడికి చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. వలస గిరిజనేతరుడు కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని రెవెన్యూ విభాగం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ (ఎల్టీఆర్) కేసు నమోదు చేయాలని తహసీల్దార్‌ను డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న సదరు వ్యక్తి బట్టల దుకాణాన్ని సీజ్ చేయాలని, అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఎంపీడీఓను నిలదీశారు. బాధితుడు రాంబాబుపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు క్రిమినల్ కేసులు బనాయించాలని పోలీసులను కోరారు. ఇప్పటికే నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.
1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
అనంతరం కొర్స నర్సింహా మూర్తి మాట్లాడుతూ మైదాన ప్రాంతం నుండి వలస వచ్చిన గిరిజనేతరుడు రాజమౌళి ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తున్న అక్రమ వ్యాపారాలను తక్షణమే సీజ్ చేయాలన్నారు. వలసవాదులు అధికార పార్టీ అండతో మదమెక్కి ఆదివాసీలపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. 1970 తర్వాత ఏజెన్సీకి వలస వచ్చిన గిరిజనేతరులను గుర్తించి వారి సొంత ప్రాంతాలకు పంపించాలని కోరారు. గిరిజన సురక్షా పేదరికం (జీఎస్‌పీ) రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఐదో షెడ్యూల్‌ను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నవనిర్మాణ సేన జిల్లా నాయకులు కుంజ మహేష్, జీఎస్‌పీ జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్, వాజేడు మండల అధ్యక్షులు మొడెం నాగరాజు, వాసం నారాయణ, ఇర్ప బాబు, శివ, ఉపసర్పంచ్ కంతి శంకర్, పాయం కిరణ్, మహిళా నాయకులు ముర్రం రామలక్ష్మి, పద్మతో పాటు వెంకటాపురం, వాజేడు మండలాల ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.