epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
నాకాబందీలో 2.4 కిలోల గంజాయి స్వాధీనం
కారు సీజ్.. ఇద్దరు నిందితులు పరారీ
పోలీసులను అభినందించిన ఎస్పీ  శబరీష్
కాకతీయ, నెల్లికుదురు : చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అక్రమార్కులను నెల్లికుదురు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నాకాబంది సందర్భంగా గంజాయితో వెళ్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని 2 కిలోల 395 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. ఈ మేరకు కేసముద్రం సీఐ సత్యనారాయణ, నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబుతో కలిసి బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ఏదుల రాజ్‌కుమార్, మాలేగోని ఆంజనేయులు అలియాస్ రామ్‌చందర్, రామ్‌గోని రాజేష్, రాజ్ అలియాస్ ఎఫ్‌జెడ్ హైదరాబాద్‌లో ఉంటూ స్నేహంగా తిరుగుతుండేవారని తెలిపారు. వీరికి గంజాయి సేవించే అలవాటు ఉండటంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాలోచనతో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. భద్రాచలం ప్రాంతానికి వెళ్లి రాజేష్ వద్ద నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసిన నిందితులు కారులో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి పార్వతమ్మగూడెం స్టేజ్ సమీపంలోని ఎంకేఆర్ గార్డెన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న కారును తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1,19,750 ఉంటుందని పోలీసులు తెలిపారు.
పరారీలో ఇద్దరు నిందితులు
గంజాయితో పాటు కారును సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. రాజ్, రాజేష్ పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిషేధిత గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నందుకు సీఐ సత్యనారాయణ, ఎస్సై చిర్ర రమేష్ బాబు, సంబంధిత పోలీసు సిబ్బందిని మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్, డీఎస్పీ ఎన్. తిరుపతిరావు అభినందించినట్లు సీఐ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.