epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లేబర్ ఆఫీస్ ఎదుట ధర్నాను జయప్రదం చేయండి 

లేబర్ ఆఫీస్ ఎదుట ధర్నాను జయప్రదం చేయండి 
భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై మే 25న నిరసన
రూ.9వేల పెన్షన్, సహజ మరణానికి రూ.5 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్
జూలూరుపాడులో టీయూసీఐ ఆధ్వర్యంలో గోడపత్రికల ఆవిష్కరణ
కాకతీయ, జూలూరుపాడు : తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సుదీర్ఘ కాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న హైదరాబాద్‌లోని రాష్ట్ర లేబర్ కార్యాలయం (కార్మిక శాఖ కమిషనర్ ఆఫీస్) ముందు తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు. గురువారం జూలూరుపాడు మండల కేంద్రంలో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను (పోస్టర్లను) నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏదులాపురం గోపాలరావు మాట్లాడుతూ.. భవన నిర్మాణ రంగంలో రాత్రింబగళ్లు కష్టపడుతున్న కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.9,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా, ఇతర సంక్షేమ పథకాల అమలు బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి రెన్యూవల్ చేసే పద్ధతిని తక్షణమే నిలిపివేయాలన్నారు. ప్రైవేట్ సంస్థలతో కార్మికులకు జరిపిస్తున్న ఆరోగ్య పరీక్షలను రద్దు చేసి, వారందరికీ ఈఎస్ఐ ఆసుపత్రి సౌకర్యాన్ని కల్పించాలని స్పష్టం చేశారు.
లేబర్ అడ్డాల వద్ద కనీస వసతులు కల్పించాలి
రైతు బీమా తరహాలోనే భవన నిర్మాణ కార్మికులకు కూడా సహజ మరణం సంభవిస్తే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డులో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత దృష్ట్యా ప్రతిరోజూ కార్మికులు గుమికూడే లేబర్ అడ్డాల వద్ద నీడ కోసం షెల్టర్లు, చల్లని మంచినీటి వసతి కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకై నిర్వహించే ప్రదర్శన, ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు ఏదులాపురం రాజు, పొరండ్ల కనకమ్మ, రాజమ్మ, నాగరత్నమ్మ, లలిత, భవాని, పట్టా ప్రసాద్, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.