epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వరంగల్‌ కమిషనరేట్‌లో భారీగా పోలీసుల బదిలీలు

వరంగల్‌ కమిషనరేట్‌లో భారీగా పోలీసుల బదిలీలు
కౌన్సిలింగ్ ద్వారా 222 మంది సిబ్బందికి స్థానచలనం
ఉత్తర్వులు జారీ చేసిన సీపీ సన్‌ప్రీత్ సింగ్

కాకతీయ, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ ఎత్తున పోలీసు సిబ్బంది బదిలీలు చోటుచేసుకున్నాయి. వివిధ పోలీస్ స్టేషన్లలో ప్రభుత్వ నిర్దేశిత కాలపరిమితి పూర్తి చేసిన సిబ్బందిని పరిపాలనా అవసరాలు, పనితీరు, సేవల సమర్థతను దృష్టిలో ఉంచుకుని బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిగా పారదర్శకమైన కౌన్సిలింగ్ విధానంలో సిబ్బంది అభిరుచులు, ఖాళీలు, సేవా అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రక్రియను నిర్వహించారు. బదిలీల్లో భాగంగా కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 15 మంది అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఏఎస్ఐలు), 160 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 47 మంది కానిస్టేబుళ్లు వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ అయ్యారు. నగరంలోని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, ప్రత్యేక విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరికీ ఈ బదిలీలు వర్తించాయి. పోలీస్ శాఖలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టడంపై సిబ్బంది నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించనున్న సిబ్బంది ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని సీపీ సూచించారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ పరిధిలో నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా భద్రత అంశాలపై మరింత దృష్టి సారించనున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.