epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కల్తీ విత్తనాలకు చెక్..

కల్తీ విత్తనాలకు చెక్..
రైతులకు నాణ్యమైన విత్తనాలే ప్రభుత్వ లక్ష్యం
నాణ్యమైన విత్తనాల వినియోగానికి ప్రాధాన్యం
వరి నుంచి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులు మళ్లాలి
ఖరీఫ్ సీజన్‌కు విత్తనాల కొరత లేదు.. 66 వేల క్వింటాళ్లు సిద్ధం
రెండు జిల్లాల్లో 2.68 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి వెల్లడి

కాక‌తీయ‌, హన్మ‌కొండ‌: రైతులకు నమ్మకమైన, అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. శనివారం హనుమకొండ జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాల ప్రతినిధులతో నిర్వహించిన విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు కల్తీ విత్తనాల బారిన పడి నష్టపోకుండా ఉండేందుకు నాణ్యమైన విత్తనాల వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి

రైతుల ఆదాయం పెరగాలంటే కేవలం వరి సాగుపైనే ఆధారపడకుండా పెసర, కంది, మినుము, శనగ, వేరుశనగ, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులను మళ్లించాలని అన్వేష్ రెడ్డి సూచించారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నేరుగా క్షేత్రస్థాయిలో రైతులతో అనుసంధానమై విత్తన ఉత్పత్తి చేపడుతుందని, కఠినమైన ల్యాబ్ పరీక్షల అనంతరం మాత్రమే నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. లైసెన్స్ కలిగిన ప్రతి విత్తన డీలర్ విత్తనాభివృద్ధి సంస్థ అధికారిక ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు.

66 వేల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో..

ప్రస్తుత వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు ఉమ్మడి జిల్లాల్లో ఎలాంటి విత్తనాల కొరత లేదని చైర్మన్ స్పష్టం చేశారు. మార్కెట్లో సన్న రకాలైన బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, కెఎన్‌ఎం-1638 తో పాటు దొడ్డు రకాలైన కెఎన్‌ఎం-118, ఎమ్‌టియు-1010 విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భూసారాన్ని పెంచే పచ్చి రొట్ట విత్తనాలైన జీలుగ, జనుము విత్తనాలను కూడా రైతులకు సకాలంలో అందిస్తున్నామని చెప్పారు. ఈ వానాకాలం సీజన్‌లో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో సుమారు 2.68 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. అందుకు గాను మొత్తం 66 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని వివరించారు.

నూతన విత్తన చట్టం ద్వారా రక్షణ

ఈ మొత్తం అవసరాలలో కనీసం 30 వేల క్వింటాళ్ల అత్యంత నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వ రాయితీ మార్గాల ద్వారా రైతులకు సరఫరా చేసేందుకు వ్యవసాయ, సహకార శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్వేష్ రెడ్డి పిలుపునిచ్చారు. త్వరలోనే రాబోయే నూతన విత్తన చట్టం ద్వారా అటు రైతుల హక్కులతో పాటు ఇటు నిజాయితీగా పనిచేసే డీలర్ల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం సంపూర్ణంగా పరిరక్షిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, సహకార శాఖ అధికారులు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, విత్తన డీలర్లు, ఎఫ్‌పీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.