పెద్దవంగర మండలంలో గంజాయి గుర్తింపు కిట్లు
కేవలం ఒక్క నిమిషంలోనే గంజాయి తాగినట్లు నిర్ధారణ
: ఎస్సై ప్రమోద్ కుమార్
కాకతీయ, పెద్దవంగర : గంజాయి సేవించిన వారిని తక్షణమే పట్టుకునేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన గంజాయి గుర్తింపు కిట్లు అందుబాటులోకి వచ్చాయని ఎస్సై ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ కిట్ల ద్వారా కేవలం ఒక్క నిమిషంలోనే సదరు వ్యక్తి గంజాయి తీసుకున్నాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించవచ్చని ఆయన పేర్కొన్నారు. మండలంలో గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్సై చెప్పారు. పాఠశాలలు, కళాశాలలతో పాటు ఇతర అనుమానాస్పద ప్రదేశాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి తీసుకుంటూ పట్టుబడితే జైలు శిక్ష తప్పదని ఎస్సై ప్రమోద్ కుమార్ హెచ్చరించారు.

