epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నాణ్యమైన విత్తనాల సరఫరాకు ప్రాధాన్యత

నాణ్యమైన విత్తనాల సరఫరాకు ప్రాధాన్యత
ఎరువుల పంపిణీలో పారదర్శకత ఉండాలి
గిరిజన రైతులకు ప్రత్యేక సేవలందించాలి
రైతుల నష్టం చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
మంత్రి సీతక్క హెచ్చ‌రిక‌

కాకతీయ, ములుగు ప్రతినిధి : నాణ్యమైన విత్తనాలే రైతులకు అందించాలని, విత్తనాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన, ఎరువులు, పురుగు మందుల డీలర్ల శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, వారిని నష్టపరిచే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విత్తన కంపెనీలు, డీలర్లు, ఆర్గనైజర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. గతంలో కల్తీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. విత్తన చట్టం ప్రకారం అన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించేలా స్థానిక స్థాయిలో నియామకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీలను కోరారు.

ముందస్తు ప్రణాళికలు అవసరం
వర్షాకాల వ్యవసాయ సీజన్‌కు సంబంధించి రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పట్టాలు లేని రైతుల పరిస్థితిని ప్రత్యేకంగా గుర్తించి, వారికి కూడా వ్యవసాయ అవసరాలు అందేలా చూడాలని సూచించారు. గ్రామస్థాయిలో రైతులకు ప్రభుత్వ విధానాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. మండలాల వారీగా డీలర్లు, వ్యవసాయ అధికారులతో సమావేశాలు నిర్వహించి సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
మంత్రి సీతక్క అనంతరం జిల్లా ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న సీసీ రోడ్లు, మహిళా సంఘాల భవనాల నిర్మాణాలను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాల భవనాల బిల్లుల అప్‌లోడ్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని, ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి కేటాయించిన ప్రతి రూపాయి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా వినియోగించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సిహెచ్. మహేందర్, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు

కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు 146వ సర్వే ప్రకారం ఆధారాలు మా వద్దే...

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్ కాకతీయ, హనుమకొండ :...

ఏళ్లు గడుస్తున్నా…మూత్రశాలలు ఏవి సామీ?

ఏళ్లు గడుస్తున్నా...మూత్రశాలలు ఏవి సామీ? తీరని బస్ స్టాండ్  కష్టాలు.. చోద్యం చూస్తున్న ఆర్టీసీ,పంచాయతీ...

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర...

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 10,...

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి జాబ్‌ క్యాలెండర్‌తో...

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు మైనర్‌ డ్రైవర్లపై కాజీపేట ట్రాఫిక్‌ పోలీసుల...

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక వినూత్న బోధనా పద్ధతులపై అధ్యయనం సాంకేతికత,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.