epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హామీల‌న్నీ అమలు చేస్తున్నాం

హామీల‌న్నీ అమలు చేస్తున్నాం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సహా సంక్షేమ పథకాలు అమలు
మున్నేరు వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం
పారిశుధ్యం, పచ్చదనం పెంపుతో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి
ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనుల నాణ్యతను పర్యవేక్షించాలి
నగర సుందరీకరణకు ప్రత్యేక చర్యలు
వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కాకతీయ,ఖమ్మం : ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని ఎఫ్‌సీఐ గోదాం నుంచి బైపాస్ రోడ్డు వరకు 3.05 కోట్ల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఇంట్లో కూడా అన్ని పనులను ఒకేసారి చేయలేమని, అదే విధంగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, పేద విద్యార్థుల కోసం యంగ్ ఇండియా పాఠశాలల ఏర్పాటు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు కొత్త ఇళ్ల మంజూరుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. గతంలో మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా జరిగేదని, ప్రస్తుతం ప్రతిరోజూ తాగునీరు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్నేరు వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టామని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించి పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

పనుల నాణ్యతపై ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ
డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని, రోడ్లు, డ్రెయిన్ల నాణ్యతపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోతే ప్రజల ఆదాయం ఆసుపత్రులకే వెచ్చించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఖాళీ స్థలాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలు నాటేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ తరహాలో ఖమ్మం నగరంలోనూ వేగంగా అభివృద్ధి జరుగుతోందని, రోడ్ల విస్తరణ, జాతీయ రహదారుల నిర్మాణంతో వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు.

నగర సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత
ఖమ్మం నగర అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అన్నారు. మున్నేరు వరదల నేపథ్యంలో 600 కోట్లతో రిటైనింగ్ వాల్ ప్రాజెక్టుకు మంత్రి కృషి చేశారని, పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వెలుగుమట్ల అర్బన్ పార్కును హైదరాబాద్ కేబీఆర్ పార్కు తరహాలో అభివృద్ధి చేస్తున్నారని, ప్రజలు సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా గడిపే కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఖమ్మం ఖిల్లా రోప్‌వే ప్రాజెక్టు అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. నగర సుందరీకరణ, పచ్చదనం పెంపుపై మంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్‌లో మెరుగైన రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌళిక సదుపాయాల కల్పనతో పాటు పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపునకు చర్యలు చేపడుతున్నామని ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ప్రజా పాలనలో గత రెండున్నర సంవత్సరాలుగా మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన అందించి ఆదాయ వనరులు కల్పిస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి డివిజన్‌లో మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఆర్డీవో శ్రీనివాస్, సంబంధిత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.