epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డ్రగ్ కంట్రోల్‌లో ఖాకీల స‌మ‌రం

డ్రగ్ కంట్రోల్‌లో ఖాకీల స‌మ‌రం
మాదకద్రవ్యాల నిర్మూలనలో వరంగల్ పోలీసుల ఘ‌న‌త‌
రెండేళ్లలో రూ. 8.57 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
192 కేసులు నమోదు.. 403 మంది నిందితుల అరెస్టు
1.24 టన్నుల గంజాయి, హషీష్ ఆయిల్ స్వాధీనం
యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడడమే లక్ష్యం : సీపీ స‌న్‌ప్రీత్ సింగ్‌

కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల కట్టడికి ఏర్పాటు చేసిన ‘డ్రగ్స్ కంట్రోల్ టీమ్’ విశేష ఫలితాలను సాధిస్తోంది. గత రెండేళ్లుగా (15-07-2024 నుండి 16-06-2026 వరకు) చేపట్టిన నిరంతర నిఘా, ప్రత్యేక దాడులతో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు చెక్ పెట్టింది.
ఈ కాలంలో పోలీసులు మొత్తం 192 కేసులను నమోదు చేసి, 403 మంది నిందితులను అరెస్టు చేశారు. వీటితో పాటు రూ. 8.57 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా 1,241 కిలోల గంజాయి, 22.4 లీటర్ల హషీష్ ఆయిల్, బ్రౌన్ షుగర్ వంటివి ఉన్నాయి. రవాణాకు ఉపయోగించిన 601 మొబైల్ ఫోన్లు, 63 ద్విచక్ర వాహనాలు, 8 కార్లు, 6 ఆటోలను కూడా పోలీసులు సీజ్ చేశారు.

వ్యసన విముక్తికి ప్రత్యేక సేవలు..
మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని ఆదుకోవడానికి ఎంజీఎం (వరంగల్), నర్సంపేట, జనగామ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పునరావాస కేంద్రాలను (డీ-అడిక్షన్ సెంటర్లు) అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్ అందిస్తున్నారు. స్మోకింగ్ కేసుల్లో నిందితులు డీ-అడిక్షన్ సెంటర్లలో చికిత్స పొంది, కోర్టుకు సర్టిఫికెట్ సమర్పిస్తే చట్టం ప్రకారం కేసుల రద్దుకు అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పాఠశాలలు, విద్యాసంస్థల పరిసరాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నారు. సమాజహితం కోసం గంజాయి సాగు, రవాణా, విక్రయాల సమాచారం ఉన్నవారు 8712685299, 8712584473 నంబర్లకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చేవారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, మాదకద్రవ్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని వరంగల్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంతా ఈశ్వర మాయ!

అంతా ఈశ్వర మాయ! లాగిన్‌ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని...

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ...

సీట్ల‌కు అంటుకుపోయారు!

సీట్ల‌కు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా...

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’ ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వ‌ర్...

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు మౌలిక వసతుల...

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది రుణమాఫీ, రైతుభరోసా,...

దొరల పాలన కాదు.. ప్రజా పాలన

దొరల పాలన కాదు.. ప్రజా పాలన దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు తాతా...

క‌డియం సిగ్గుప‌డు..!

క‌డియం సిగ్గుప‌డు..! కేసీఆర్‌ దళితులకు ఏం చేయలేదా.?! ఎన్టీఆర్‌ తర్వాత నీకు రాజకీయ బిక్ష...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.