epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నకిలీ స్నాక్స్ గుట్టురట్టు..

నకిలీ స్నాక్స్ గుట్టురట్టు..
‘టాస్క్‌ఫోర్స్’ మెరుపు దాడి!
అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ తినుబండారాల తయారీ
రూ.లక్షకు పైగా విలువైన పాడైపోయిన నిల్వలు, కెమికల్స్ సీజ్
య‌జ‌మాని తరమం ఆశీర్వాదం అరెస్టు
కేసును ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగింత

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగర పరిధిలోని చింతల్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ, నకిలీ స్నాక్స్ తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం మెరుపు దాడి నిర్వహించారు. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో, నిబంధనలకు విరుద్ధంగా తినుబండారాలు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న యూనిట్ గుట్టురట్టు చేశారు. అక్కడ నిల్వ ఉంచిన రూ. లక్షకు పైగా విలువైన పాడైపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. చింతల్ ప్రాంతంలో ‘మరియా ట్రేడర్స్’ పేరుతో ఓ వ్యక్తి స్నాక్స్ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే సదరు కేంద్రంలో ప్రమాదకరమైన, పాడైపోయిన వంటనూనెలను రీ-సైక్లింగ్ చేస్తూ, ప్రభుత్వ అనుమతి లేని కెమికల్ ఫుడ్ కలర్లను వాడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌కు నమ్మకమైన సమాచారం అందింది. దీనిపై స్పందించిన పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఉమ్మడిగా దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో నాణ్యత లేని ఖారా, భోంది, చేకోడి, రసాయనాలతో కూడిన కారం పొడి పెద్ద ఎత్తున లభ్యమైంది. మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ. 1,06,780 ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

నిందితుడిపై కఠిన చర్యలు
అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న యూనిట్ యజమాని తరమం ఆశీర్వాదాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న భారీ కల్తీ సరుకుతో పాటు నిందితుడిని తదుపరి చట్టపరమైన క్రమశిక్షణా చర్యల నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ కాలం చెల్లిన, అపరిశుభ్ర ఆహార పదార్థాలను విక్రయించే కేటుగాళ్లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులు కూడా మార్కెట్‌లో ఎలాంటి తినుబండారాలు కొనుగోలు చేసినా.. వాటి తయారీ, గడువు తేదీ మరియు నాణ్యత ప్రమాణాలను తప్పక పరిశీలించాలని సూచించారు. ఈ ఆకస్మిక దాడిని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ ఎల్. మంగీలాల్, ఎస్‌ఐ బి. చందర్ మరియు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మౌనిక సంయుక్తంగా నిర్వహించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.