మన అగ్రిటెక్ ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సాయం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మన అగ్రిటెక్ సంస్థ ఉద్యోగి బోగ రాము ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. ఈ మేరకు ఆయన కుటుంబానికి అండగా సంస్థ అధినేత పాశికంటి రమేష్, సిబ్బంది కలిసి రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. బోగ రాము దశదిన కర్మ సందర్భంగా మంగళవారం ఆయన కుటుంబ సభ్యులకు చెక్ రూపంలో సాయాన్ని అందించి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రామును కోల్పోవడం తీవ్ర బాధ కలిగించిందని, ఆయన లేని లోటు తీర్చలేనిదని, కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని పాశికంటి రమేష్ తెలిపారు.
కార్యక్రమంలో మన అగ్రిటెక్ సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

