యువత మత్తు పదర్థాలకు దూరంగా ఉండాలి : సీఐ రవీందర్
కాకతీయ, రుద్రంగి : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో ఉన్నత భవిష్యత్తును పొందాలని సీఐ రవీందర్ అన్నారు. గురువారం రాజన్న సిరిసిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో మాదకద్రవ్యాల నిర్ములన కోసం కేరళ స్కూల్ విద్యార్థులతో కలిసి సీఐ రవీందర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా చౌక్ నుండి పోలీస్టేషన్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టం వివరించి మత్తు పదార్థాల నిర్ములాన కోసం విద్యార్థులచే సీఐ ప్రతిజ్ఞ చేయించారు. సీఐ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యకరమైన జీవితం పెంపొదించుకోవాలని, యువత గంజాయి, కొకైన్, ఆల్కహాల్ బారిన పడకూడదని మండలంలో ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్లు తెలిస్తే 1908 కి గాని పోలీస్ లకు గాని సమాచారం అందించాలని కోరారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్ములానే లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రవీందర్, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

