epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చెరువులో ‘అక్రమ’ మైనింగ్

  • నిబంధనలన్నీ ‘గాలికి’!
  • దామెర చెరువును కొల్లగొడుతున్న మాఫియా
  • నిబంధనల విరుద్ధంగా భారీ తవ్వకాలు
  • 15 రోజుల అనుమతి పొంది.. రెండు నెలలుగా ‘మట్టి’ దోపిడీ
  • మైనింగ్ అధికారుల కనుసన్నల్లోనే చెరువు విధ్వంసం?
  • డీఈ వ్యాఖ్యలతో బయటపడ్డ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం

కాకతీయ, వ‌రంగ‌ల్‌ బ్యూరో : పరకాల దామెర చెరువు ప్రస్తుతం అక్రమ మైనింగ్‌కు అడ్డాగా మారింది. ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్’ నిర్మాణం పేరుతో మొదలైన మట్టి తవ్వకాలు, ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయి ‘మైనింగ్’గా మారాయి. పగలు, రాత్రి తేడా లేకుండా జేసీబీల సాయంతో చెరువు గర్భాన్ని తవ్వేస్తూ, విలువైన మట్టిని అక్రమంగా తరలిస్తున్నా మైనింగ్, ఇరిగేషన్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. చెరువుల్లో మైనింగ్ చేయాలంటే రెవెన్యూ, ఇరిగేష‌న్ డిపార్ట్‌మెంట్ల నుంచి అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. కానీ ఇక్కడ మాత్రం అధికార పార్టీ నేతల అండతో ఇవేవీ పాటించడం లేదు. కేవలం 15 రోజులు మాత్రమే అనుమతి ఇచ్చామని ఇరిగేషన్ శాఖ డీఈ చెబుతున్నా, గత రెండు నెలలుగా యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. ఎంత మట్టి తీశారు? ఎంత రాయల్టీ చెల్లించారు? అసలు మైనింగ్ అనుమతులు ఉన్నాయా? అనే ప్రాథమిక ప్రశ్నలకు కూడా సమాధానం కరువైంది.

డీఈ సమాధానంలో ‘మైనింగ్’ లొసుగులు!
ఈ అక్రమ మైనింగ్‌పై కాక‌తీయ‌ డీఈని వివ‌ర‌ణ కోర‌గా.. “ఎమ్మెల్యేకు సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారని, మట్టిని స్కూల్ కోసం వాడుతున్నామని, మీరు ఎన్ని వార్తలు రాసినా ఏమీ కాదు” అని వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం. చట్టం కంటే రాజకీయ ఒత్తిళ్లే ఇక్కడ రాజ్యమేలుతున్నాయని స్పష్టమవుతోంది. “ఎన్ని క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇచ్చారో రికార్డులు చూసి చెబుతా” అని డీఈ త‌ర్వాత స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మనార్హం. పక్కాగా నిబంధనలను ఉల్లంఘించి చేస్తున్న మైనింగ్ మాఫియాకు అధికారులే సహకరిస్తున్నారని తేటతెల్లమవుతోంది. ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు చెరువుల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ దామెర చెరువు విషయంలో మాత్రం క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిగిన ఆనవాళ్లు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ సంఖ్యలో ట్రాక్టర్లు తిరుగుతున్నా, యంత్రాలు పనిచేస్తున్నా అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందని అంటున్నారు. దామెర చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకాలపై జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, మైనింగ్ శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతుల కాపీలు, క్యూబిక్ మీటర్ల వివరాలు, గడువు, మట్టి తరలింపు లెక్కలను ప్రజలకు వెల్లడ చేయాలని, అనుమతులకు విరుద్ధంగా తవ్వకాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పర్యావరణానికి ముప్పు – విచారణకు డిమాండ్!
భూగర్భ జలాలు ఊరేంత లోతులో తవ్వకాలు జరపడంతో భవిష్యత్తులో చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని గ్రామ‌స్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కేవలం స్కూల్ నిర్మాణం కోసమే కాకుండా, అక్రమంగా మట్టిని విక్రయిస్తూ లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే జిల్లా కలెక్టర్ చాహ‌త్‌బాజ్‌పేయి ఈ విష‌యంపై దృష్టి సారించాల‌ని గ్రామ‌స్తులు డిమాండ్ చేస్తున్నారు. చెరువులో జరుగుతున్న ఈ అక్రమ మైనింగ్‌పై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన మైనింగ్ మాఫియాను, వారికి సహకరిస్తున్న అధికారులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.