epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నెక్కొండ ఎస్సైపై యాక్షన్

  • సస్పెండ్ చేసిన వరంగల్ సీపీ శ్వేత
  • అవినీతి ఆరోపణలు, సివిల్ కేసులో ఎస్సై మహేందర్ జోక్యం
  • బాధితులకు వ్యతిరేకంగా ప్రవర్తన
  • డిపార్ట్మెంట్ విచారణలో నిజ నిర్ధారణ
  • ఎస్సైని విధుల నుంచి తొలగిస్తూ సీపీ శ్వేత ఆదేశాలు

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లాలో మరో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పోలీసుపై వేటుపడింది. నెక్కొండ ఎస్సై మహేందర్ సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మహేందర్ పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అదీ కాకుండా ఓ సివిల్ కేసులో బాధితులకు వ్యతిరేకంగా వ్యవహరించారనే అపవాదు కూడా మూటగట్టుకున్నారు. రూ. 50 వేలు బాకీ పడినందుకు తన భార్యపై దాడి చేసి తన గొర్లు, మేకలను అనిల్, వాగ్య.. మరికొందరు కలిసి దౌర్జన్యంగా పట్టు కెళ్లారని నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గాడుదల వెంకన్న ఎస్సై మహేందర్ కు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఎస్సై బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినట్లు బాధితుడు ఆరోపిస్తూ నర్సంపేట ఏసీపీకి ఫిర్యాదు చేసాడు. ఇది ఇలా ఉండగా, ఎస్సై మహేందర్ పలు కేసుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ క్రమంలో ఎస్సై తీరుపై శాఖా పరమైన విచారణకు పోలీస్ ఉన్నత అధికారులు ఆదేశించారు. విచారణలో ఎస్సై మహేందర్ పై వెళ్ళు వెత్తిన ఆరోపణలు, గొర్రెల కేసులో బాధ్యత రాహిత్యం నిజమని తేలినట్లు తెలిసింది. ఎస్సై తీరుపై ఏ మాత్రం ఉపేక్షించకుండా శాఖా పరమైన చర్యలు చేపట్టారు. ఎస్సై మహేందర్ను విధుల నుంచి తప్పిస్తూ సస్పెండ్ చేశారు. వరంగల్ సీపీ శ్వేత ఏ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడినా, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ములుగు మిల్లర్లలో గుబులు!

ములుగు మిల్లర్లలో గుబులు! ఆరుగురి అరెస్టుతో జిల్లాలో కలకలం అధ్యక్షుడు సతీష్‌ పేరుతో వైరల‌వుతున్న...

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి కాకతీయ, నెల్లికుదురు: విధుల నిర్వహణలో పోలీసులు...

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : కమలాపురం మండలం...

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన -విబిజీ రాంజీ ఉపాధి పనుల పరిశీలన...

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర... *నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి నామ స్మరణతో...

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలి గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించాలని...

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌ కాకతీయ, గీసుగొండ: పోలీసు...

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య నెల్లికుదురులో రూ.7.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.