గుండాలలో కలకలం…
8 అడుగుల భారీ పైథాన్ పాము ప్రత్యక్షం…
ఆహారం కోసం జనావాసాల్లోకి…
స్థానికుల్లో భయాందోళన…
కాకతీయ,కొత్తగూడెం ప్రతినిధి…
గుండాల మండలం జీసీ రోడ్డులో ని చేబోతు రవి ఇంటి వద్ద బుధవారం రాత్రి 8 అడుగుల పొడవు గల భారీ పైథాన్ పాము ప్రత్యక్షమై స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది.ఇంటి సమీపం లో పామును గమనించిన స్థానికులు ఒక్కసారిగా భయం తో పరుగులు తీశారు.అయితే కొందరు ధైర్యవంతులైన యువకులు పామును బంధించేందుకు ప్రయత్నించారు. అటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం ఈ పాము జనావాసాల్లోకి వచ్చి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.ఈఘటన తో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని,పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని స్థానికులు ఒకరికొకరు సూచించుకుంటున్నారు.

