గార్లఒడ్డులో ఏవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన
కాకతీయ,ఏన్కూర్ : గార్లఒడ్డు గ్రామపంచాయతీ పరిధిలోని ఏవెన్యూ ప్లాంటేషన్‌ను డిప్యూటీ కమిషనర్, డీఎల్‌పీవో, ఎంపీడీవో, ఎంపీవో, ఏపీడీ, ఏపీవో అధికారులు సర్పంచ్ భూక్యా నర్సి, ఉపసర్పంచ్ శివలంకి వెంకటేశ్వర్లుతో కలిసి సందర్శించారు. ప్లాంటేషన్‌లోని మొక్కల పెంపకం, సంరక్షణ తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భూక్యా లాలు, పేలప్రోలు వర శంకర్ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్‌రావు, వార్డు సభ్యురాలు డి.జ్యోతి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

